Bears Fight: క్యార్ గ్యారేజ్ నుంచి వస్తున్న శబ్దం ఏంటా అని చూసి షాక్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-06-22T22:40:10+05:30 IST

అమెరికాలోని ఒక మహిళ గ్యారేజ్‌లోకి రెండు ఎలుగు బంట్లు ప్రవేశించి అక్కడ హోరాహోరీగా తలపడ్డాయి.

Bears Fight: క్యార్ గ్యారేజ్ నుంచి వస్తున్న శబ్దం ఏంటా అని చూసి షాక్.. వీడియో వైరల్

అమెరికాలోని ఒక మహిళ గ్యారేజ్‌లోకి రెండు ఎలుగు బంట్లు ప్రవేశించి అక్కడ హోరాహోరీగా తలపడ్డాయి. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో ఆ ఘటన మొత్తం రికార్డు అయింది. ఆ క్లిప్‌ను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో రెండు ఎలుగు బంట్లు ఒకదానితో ఒకటి పెనుగులాడడం, ఒకదానితో మరొకటి పోటీపడడం, కేకేలు వేయడం కనపించింది. 




కొద్దిసేపటి తర్వాత రెండు ఎలుగు బంట్లు నేల మీద పడి కుస్తీ పట్టాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటికే 4,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు.  ఈ వీడియో వందల కొద్దీ లైక్‌లు, కామెంట్లు దక్కించుకుంది. 

Updated Date - 2022-06-22T22:40:10+05:30 IST