పెన్నానదిలో ఇద్దరు యువకుల గల్లంతు

ABN , First Publish Date - 2021-03-02T07:16:29+05:30 IST

మండలంలోని బోడాయిపల్లి వద్దగల పెన్నానదిలో సోమవారం సా యంత్రం ఈతకు వెళ్లిన యువకులు ఉదయ్‌ (19), శ్రీధర్‌ (18) గల్లంతయ్యా రు.

పెన్నానదిలో ఇద్దరు యువకుల  గల్లంతు
శ్రీధర్‌

- ముమ్మరంగా గాలింపు చర్యలు

తాడిపత్రి, మార్చి 1 : మండలంలోని బోడాయిపల్లి వద్దగల పెన్నానదిలో సోమవారం సా యంత్రం ఈతకు వెళ్లిన యువకులు ఉదయ్‌ (19), శ్రీధర్‌ (18) గల్లంతయ్యా రు. పోలీసులు తెలిపిన మేరకు... బోడాయిపల్లి వైసీపీ సర్పంచ్‌ రామాంజన మ్మ, ఆటో డ్రైవర్‌ రామ్మోహన్‌ కుమారుడు ఉదయ్‌, అదే గ్రా మానికి చెందిన వ్యవసాయ కూలీ వెంకటప్ప, రంగమ్మ కుమారుడు  శ్రీధర్‌ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరూ సోమవారం మోటార్‌సైకిల్‌ను కడిగేందుకు సమీపంలోని పెన్నానది వద్దకు వెళ్లారు. మోటార్‌సైకిల్‌ కడిగిన అనంతరం ఈత కొ ట్టేందుకు నది లోకి వెళ్లారు. నదిలో గతంలో పెద్ద ఎత్తున జరిపిన ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. వీటిలో ఇసుకస్థానంలో బంకమట్టి పేరుకుపో యింది. ఈ గోతులు వర్షపునీటితో నిండి ఉన్నాయి. ఈతకు వెళ్లిన యువకులిద్దరూ ఒడ్డుపై నుంచి నదిలోకి దూకడంతో గోతుల్లోని కిందిభాగంలో ఉన్న బంకమట్టిలో కూరుకుపోయి బయటకు రాలేక ఊపిరి ఆడక మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. గట్టుపైన మోటార్‌సైకిల్‌ ఉన్నా మనుషులు ఎ వరూ లేకపోవడంతో చుట్టుపక్కల వారు ఈ విషయాన్ని గ్రామంలోని వారికి తెలియజేశారు. యువకులిద్దరూ పెన్నానది ఒడ్డుకు మోటార్‌సైకిల్‌ కడిగేందుకు వెళుతున్నామని ఇంటిలో చెప్పి ఉండడంతో తమ పిల్లలు పెన్నానదిలో గల్లంతై ఉంటారన్న భయాందోళనలతో కుటుంబసభ్యులు పరుగున నది వద్దకు వెళ్లారు. గ్రామస్థులు సైతం పెద్దఎత్తున తరలివచ్చారు. సంఘటనా స్థలంలోని ఆనవాళ్లను బట్టి పెన్నానదిలో గల్లంతై ఉంటారన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు సమాచారాన్ని రూరల్‌ పోలీసులకు అందించారు. దీంతో  రూరల్‌ ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌ కడప జిల్లా మైలవరం ప్రా జెక్ట్‌కు సమాచారం అందించి అక్కడి నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. ఒకవైపు పో లీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, మరోవైపు గజ ఈతగాళ్లతో పాటు స్థానికులు పెన్నానదిలోకి దూకి తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సైతం గాలింపు చర్యలు చేపట్టేందుకు పెన్నానది ఒడ్డున లైట్లను ఏర్పాటు చేశారు. కాగా ఉదయ్‌ తాడిపత్రి పట్టణంలోని సరస్వతీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీధర్‌ ప్రైవేట్‌ కళాశాలలో ఐటీఐ చదువుతూ వ్యవసాయ పనులకు వెళ్లేవాడని బంధువులు తెలిపారు.



Updated Date - 2021-03-02T07:16:29+05:30 IST