
నిజామాబాద్: జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులను దుండగులు హత్య చేసారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి దగ్గర రాజుభాయ్, అనీల్ గౌడ్ అనే ఇద్దరు వ్యక్తులను దుండగులు గొడ్డలితో నరికి చంపారు. అయితే ఈ హత్యకు ఇంకా కారణాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ హత్యలు పట్టణంలో సంచలనం సృష్టించాయి.