విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి

ABN , First Publish Date - 2022-07-01T06:33:48+05:30 IST

అధికారుల నిర్లక్ష్యంతో విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుమ్మలతండాకు చెందిన రైతులు సౌదసోతు శ్రీను, కృష్ణలకు చెందిన పాడి గేదెలు మేతకు కోసం గురువారం గ్రామ శివారుకు వెళ్లాయి.

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి

మఠంపల్లి, జూన్‌ 30: అధికారుల నిర్లక్ష్యంతో విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి  చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుమ్మలతండాకు చెందిన  రైతులు సౌదసోతు శ్రీను, కృష్ణలకు చెందిన పాడి గేదెలు మేతకు కోసం గురువారం గ్రామ శివారుకు వెళ్లాయి.  గేదెలు మేత మేస్తూ టాన్స్‌పార్మర్‌ పక్కన తెగి పడి ఉన్న విద్యుత్‌ వైర్లకు తాగి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాయి.  విద్యుత్‌ వైర్లు తెగి పడ్డాయని విద్యుత్‌ అధికారులకు విన్న వించినా పట్టించుకోనందున గేదెలు మృతిచెందాయని బాధిత రైతులు శ్రీను, కృష్ణనాయక్‌లు ఆరోపించారు. ఒక్కో గేదె విలువ రూ.80వేలు ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరారు.


Updated Date - 2022-07-01T06:33:48+05:30 IST