Advertisement

కళ్లకు గంతలు కట్టుకుని... ఇద్దరు పిల్లల తల్లి సాహసం!

Mar 8 2021 @ 10:50AM

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆధునిక కాలంలో మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అసాధ్యాలను అవలీలగా సుసాధ్యం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ముథామిల్ సెల్వీ చేసిన సాహసాన్ని చూస్తే ఔరా అనకుండా ఉండలేరు. 23 ఏళ్ల సెల్వీ ఇద్దరు పిల్లల తల్లి. 

 

ఆమె కళ్లకు గంతలు కట్టుకుని, 155 అడుగుల ఎత్తయిన పర్వతం నుంచి 58 సెకెన్లలో కిందకు దిగి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ముథామిల్ సెల్వీ మీడియాతో మాట్లాడుతూ ఒక భారతీయ మహిళగా, అందులోనూ ఇద్దరు పిల్లలకు అమ్మగా ఉంటూ కూడా ఏదో ఒక సాహసం చేయాలని అనుకున్నాను. ఇందుకోసం 155 అడుగుల ఎత్తయిన పర్వతం మీద నిలుచుని, కళ్లకు గంతలు కట్టుకుని, అంతెత్తు నుంచి అవలీలగా కిందకు దిగి మహిళా శక్తిని చాటానన్నారు. పురుషులతో సమానంగా మహిళలు ఏ పనినైనా చేయగలరని, మహిళల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకే తాను ఈ సాహసం చేశానని సెల్వీ తెలిపారు. 

Follow Us on:
Advertisement