Rains: రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-07-31T16:04:41+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 48 గంటల్లో పలు జిల్లాల్లో భారీవర్షాలు(Heavy rains కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.

Rains: రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు

ఐసిఎఫ్‌(చెన్నై), జూలై 30: రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 48 గంటల్లో పలు జిల్లాల్లో భారీవర్షాలు(Heavy rains కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో, నీలగిరి, కోయంబత్తూర్‌, తంజావూర్‌, తిరువారూర్‌(Thanjavur, Tiruvarur), అరియలూరు, మైలాడుదురై, కడలూరు, కారైక్కాల్‌ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రాజధాని చెన్నై(Capital is Chennai)లో పగటి పూల ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని, పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 26-27 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2022-07-31T16:04:41+05:30 IST