చోరీ కేసుల్లో ఇరువురు పాతనేరస్థులు అరెస్టు

ABN , First Publish Date - 2022-01-19T05:46:40+05:30 IST

పలు చోరీ కేసు ల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. మంగళవారం ఒం గోలులోని పోలీసు కార్యాలయం ఆవరణలో గల గెలాక్సీభవనంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్ల డించారు.

చోరీ కేసుల్లో ఇరువురు పాతనేరస్థులు అరెస్టు
కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ మలికగర్గ్‌

రూ.13లక్షల విలువైన సొత్తు స్వాధీనం

ఎస్పీ మలికగర్గ్‌ వెల్లడి


ఒంగోలు(క్రైం), జనవరి18: పలు చోరీ కేసు ల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికగర్గ్‌ తెలిపారు. మంగళవారం ఒం గోలులోని పోలీసు కార్యాలయం ఆవరణలో గల గెలాక్సీభవనంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్ల డించారు. ఒంగోలు నగరం అరుణోదయ కాలనీ కి చెందిన షేక్‌ షాహుల్‌, మొగల్‌రహుల్‌ అలి యాస్‌ రాహుల్‌ అనే అన్నదమ్ములు పలు కేసు ల్లో గతంలో జైలు పాలయ్యారు. ఈక్రమంలో షేక్‌ షాహుల్‌ ప్రస్తుతం జైలులో ఉంటున్నాడు. అతని సోదరుడు రాహుల్‌ శిక్ష అనుభవించి బ యట ఉంటున్నాడు. దీంతో జైలులో షాహులుకు రేపల్లెకు చెందిన మరో నేరస్థుడు కాగితా శ్రీనాథ్‌ పరిచయం అయ్యాడు. శ్రీనాథ్‌ జైలు నుంచి బ యటకు వచ్చిన తరువాత షాహుల్‌ తన సోద రుడు రాహుల్‌కు పరిచయం చేశారు. అనంత రం ఇరువురు రేపల్లెలో ఇల్లు అద్దెకు తీసుకొని ప లు దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో  పాత నే రస్థులపై నిఘా పెట్టిన సీసీఎస్‌ పోలీసులు రా హుల్‌, శ్రీనాథ్‌ను అదుపులోకి తీసుకొని సుమా రు రూ.13లక్షలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


14 కేసుల్లో నిందితులు


ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన 14చోరీ కేసుల్లో రాహుల్‌, శ్రీనాథ్‌ నిందితులు. వారు బైక్‌లను చోరీ చేసి రాత్రుళ్లు తిరుగుతూ ఇంటికి తాళం వేసిన వాటిని గుర్తిస్తారు. వెంటనే చోరీల కు పాల్పడతారు. రాహుల్‌ ఇంటి తాళాలను పగ లకొట్టి చోరీలకు పాల్పడటం చిన్నతనం నుంచి అలవాటు. దీంతో ఇరువురు అనేక దొంగతనాల కు పాల్పడి చోరీ చేసిన సొత్తు కుదువ పెట్టి వ చ్చిన డబ్బుతో సరదాలు చేస్తున్నారని ఎస్పీ వెల ్లడించారు. సోమవారం సాయంత్రం పేర్నమిట్ట కొండ మీద అనుమానాస్పదంగా ఉన్న ఇరు వురిని ఒంగోలు తాలుకా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద చోరీలకు పాల్ప డిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చె ప్పారు. కాగా నిందితులను పట్టుకోవడంలో అ త్యంత ప్రతిభ కనబరిచిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, తాలుకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు పి.విశ్వనాథ్‌రెడ్డి, సమదర్‌వలి, ఎం.దేవ కుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ వై.వెంకటేశ్వర్లు, సీసీ ఎస్‌ సిబ్బందిని ఎస్పీ మలికగర్గ్‌ అభినంధించి ప్ర శంసాపత్రాలను అందజేశారు. 


వృద్ధురాలిని రక్షించిన మహిళా పోలీసు


సాగర్‌ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నా నికి పాల్పడుతున్న వృద్ధురాలిని రక్షించిన మహి ళా పోలీసును ఎస్పీ మలికగర్గ్‌ అభినందించారు. సోమవారం గుంటూరు జిల్లా వినుకొండకు చెం దిన బిందె గాలెమ్మ కొనకనమిట్ల మండలం గవి నిపాడులో ఉన్న తన కుమార్తె ఇంటికి వచ్చింది. అయితే ఆమె గొడవ పడి ఇంటికి వెళుతూ కురి చేడు సమీపంలో గల సాగర్‌ కాలువలో దూకెం దుకు ప్రయత్నం చేసింది. ఈ విషయం గమనిం చి మహిళా పోలీసు మస్తాన్‌బీ ఆమెను కాపా డారు. గాలెమ్మను వారి బంధువులకు అప్పగించి నట్లు ఎస్పీ తెలిపారు.


రాత్రిళ్లు కర్ఫ్యూ..


కొవిడ్‌ ఉధృతి పెరుగుతున్నందున రాష్ట్ర ప్ర భుత్యం రాత్రులు కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు ఇ చ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు మంగళవా రం నుంచి రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలు అందరూ పాటించాలని ఎస్పీ సూచించారు. 


Updated Date - 2022-01-19T05:46:40+05:30 IST