వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-22T05:46:16+05:30 IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

మర్పల్లి/తాండూరు రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంఘటనలు మర్పల్లి, తాండూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిల్లో చోటుచేసుకున్నాయి. బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన మర్పల్లి పరిధి గుర్రంగట్టు గ్రామసమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్‌పల్లి మండలం బుగ్గాపూర్‌ గ్రామానికి చెందిన నర్సింహులు (45) తన స్నేహితుడు రమే్‌షతో కలిసి బుధవారం సాయంత్రం బైక్‌పై మర్పల్లి గ్రామంలో ఉన్న బంధువుల వద్దకు వస్తుండగా గుర్రంగట్టు గ్రామ సమీపంలో బైక్‌ అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా రమేష్‌ తేరుకొని ఫోన్‌ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందజేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు వారిని మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా నర్సింహులు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. తీవ్రగాయాలైన రమేష్‌ చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మర్పల్లి ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.


ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొని యువకుడు..

 ట్రాక్టర్‌, బైక్‌ ఢీ కొన్న సంఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరన్‌కోట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండల పరిధిలోని కోటబాస్పల్లి గ్రామానికి చెందిన చాకలి సంతో్‌షకుమార్‌(22), అదే గ్రామానికి చెందిన రామకృష్ణలు బైక్‌పై తాండూరు వస్తున్నారు. అదే సమయంలో ట్రాక్టర్‌ కూడా వస్తుండగా, సైడ్‌ ఇచ్చే క్రమంలో అల్లాపూర్‌-రాంపూర్‌ రోడ్డు మార్గంలోని మామిళ్ల వద్ద ప్రమాదవశాత్తు సంతోష్‌ బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో సంతోష్‌ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందగా రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కరన్‌కోట్‌ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సంతోష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణను చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-22T05:46:16+05:30 IST