ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే.. ఈ కుర్రాళ్లు జీవితంలో ఇంకెప్పుడూ Prank Videoల జోలికి వెళ్లరేమో!

ABN , First Publish Date - 2022-06-25T16:48:15+05:30 IST

స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్.. ఈ రెండూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది You Tube(యూట్యూబ్‌)లోని వీడియోలను చూస్తూ.. కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కురాళ్లు యూట్యూబ్‌లో Prank Video(ప్రాంక్ వీడియో)అను చూసి, నవ్వుకున్నారు. అనంతరం.. తాము కూడా తమ ఫ్రెండ్‌ను ప్రాంక్ చేయా

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే.. ఈ కుర్రాళ్లు జీవితంలో ఇంకెప్పుడూ Prank Videoల జోలికి వెళ్లరేమో!

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్.. ఈ రెండూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది You Tube(యూట్యూబ్‌)లోని వీడియోలను చూస్తూ.. కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కురాళ్లు యూట్యూబ్‌లో Prank Video(ప్రాంక్ వీడియో)అను చూసి, నవ్వుకున్నారు. అనంతరం.. తాము కూడా తమ ఫ్రెండ్‌ను ప్రాంక్ చేయాలని భావించారు. పక్కా ప్లాన్ వేసుకుని రంగంలోకి దిగిపోయారు. అయితే వాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. జీవితంలో ఆ కుర్రాళ్లు బహుశా మళ్లీ ప్రాంక్ వీడియోల జోలికి వెళ్లకపోవచ్చు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని అజ్మీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లలో ఒకరి వయసు 15 సంవత్సరాలు కాగా.. మరొకరి వయసు 16ఏళ్లు. తాజాగా ఈ కుర్రాళ్లు.. యూట్యూబ్‌లో Prank Video‌లను చూశారు. సరదాగా నవ్వుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఆ తర్వాత ఇద్దరూ తమ ఫ్రెండ్‌ను ప్రాంక్ చేసి, ఆ దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించాలని భావించారు. ఇందులో భాగంగానే ఆడవాళ్లలాగా గెటప్ మార్చుకున్నారు. ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిపోయారు. ఇక్కడే వాళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. ఆడవాళ్ల వేషంలో ఈ కుర్రాళ్లు అనుమానాస్పదంగా తిరగడం చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ఆడ బిడ్డలను ఎత్తుకుపోయే గ్యాంగేమో అని సందేహ పడ్డారు. అంతే.. ఆ కుర్రాళ్లను చుట్టముట్టి.. తొలుత దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసుల విచారణలో.. ఈ కుర్రాళ్లు పిల్లలను ఎత్తుకుని పోయే గ్యాంగ్ కాదనే విషయం బయటపడింది. దీంతో ఇద్దరినీ వదిలేశారు. ఈ క్రమంలో బతుకు జీవుడా అంటూ ఆ కుర్రాళ్లు ఇద్దరూ పోలీస్ స్టేషన్‌ నుంచి బయటపడ్డారు. కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-06-25T16:48:15+05:30 IST