NRI: ఎన్నారై ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్..

ABN , First Publish Date - 2022-09-11T02:25:13+05:30 IST

Two gangsters arrested for firing shots at NRI’s house; pistol, ammo recovered

NRI: ఎన్నారై ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్..

ఎన్నారై డెస్క్: పంజాబ్‌కు(Punjab) చెందిన ఓ ఎన్నారై ఇంటి వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను(Gangsters) పోలీసులు తాజాగా అరెస్టు(Arrest) చేశారు. వారి నుంచి పిస్తోలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.  నిందితులను అనోష్ మాసీ, సావన్ మాసీగా గుర్తించారు. వారిద్దరు ఫెరోజ్‌పూర్ జిల్లాకు చెందిన వారని చెప్పారు. తాల్వండీ భాయ్ ప్రాంతం నుంచి మోగా నగరానికి తిరిగొస్తుండగా.. డగ్రూ గ్రామసరిహద్దుల్లో వారు పోలీసులకు చిక్కారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలిప్పీన్స్‌లో (Philippines) నివసించే సుఖ్‌జిందర్ సింగ్‌కు..మొగా జిల్లాలోని(Moga district) బుక్కన్‌వాలా గ్రామంలో ఓ ఇల్లు ఉంది. గతవారం అనోష్, సావన్‌లు ఆయన ఇంటి వద్ద కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే.. మన్‌ప్రీత్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్ ప్రోద్బలంతోనే తాము ఈ పని చేశామని చెప్పుకొచ్చారు. కెనడాలో ఉండే గ్యాంగ్‌స్టర్ ఆర్ష్ దాలా పేరు చెప్పి మన్‌ప్రీత్.. పంజాబ్‌లోని ప్రముఖులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటాడని తెలిపారు. ఇక సుఖ్‌జిందర్‌ నుంచి కూడా మన్‌ప్రీత్ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడని, రూ.25లక్షలు డిమాండ్ చేశాడని చెప్పారు. 


ఇందుకు సుఖ్‌జిందర్ అంగీకరించకపోవడంతో.. ఆయనను బెదిరంచేందుకు ఇంటి వద్దకెళ్లి కాల్పులు జరపాలని తమను కోరినట్టు అనోష్, సావన్ పోలీసుల ముందు అంగీకరించారు. దీంతో.. పోలీసులు ఆ ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. మన్‌ప్రీత్‌కు, కెనడాలోని ఆర్ష్ దాలా మధ్య సంబంధాలపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-09-11T02:25:13+05:30 IST