
ఇంటర్నెట్ డెస్క్: రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో ఇద్దరు యువతులు చేసిన రచ్చ ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కొందరు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియా పోస్టు చేశారు. దీంతో వారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో వీడియోను చూసి, విషయం తెలుసుకుంటున్న నెటిజన్లు.. ముక్కున వేలేసుకుంటున్నారు. చదువుకోమని పంపిస్తే.. వాళ్లు చేసే పని ఇదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే..
బిహార్‌కు చెందిన ఇద్దరు యువతులు.. నవీన్ నగర్‌లోని ఓ విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే గురువారం కూడా ఇంటి నుంచి బయల్దేరిన ఆ యువతులు.. నవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆ ఇద్దరు యువతులు ఒకరికొకరు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఓ యువతి మరో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నా బాయ్‌ఫ్రెండ్‌తో నువ్వు ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావ్. నీ మొబైల్ ఇవ్వూ’ అంటూ ద్వజమెత్తింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఇచ్చేందుకు రెండో యువతి నిరాకరించింది. దీంతో ఇద్దరు యువతుల మధ్య గొడవ మొదలైంది. ఒకరిపై మరొకరు పెద్దగా పెద్దగా అరుచుకుంటూ కుస్తీకి దిగారు. రైల్వే స్టేషన్లో ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచి.. కొట్టుకోవడం ప్రారంభించారు.
దీంతో స్టేషన్లో ఉన్న ప్రయాణికుల కళ్లు ఆ గొడవపై పడ్డాయి. ఈ క్రమంలో వెంటనే అక్కడకు చేరుకుని వేడుక చూశారు. ఇంకొందరు.. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించడం ప్రారంభించారు. అయితే విషయం పోలీసుల దాకా వేళ్లడంతో.. అధికారులు అక్కడకు చేరుకోవడంతో ఆ యువతులు స్టేషన్ వదిలి పారిపోయారు. కాగా.. ఓ యువకుడి కోసం ఇద్దరు మైనర్ యువతులు కొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. యువతుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.