Unique Love Story: పెళ్లికాని అమ్మాయి.. పెళ్లయిన ఓ యువతితో ప్రేమలో పడితే.. చివరకు ఇద్దరూ కలిసి ఎంతపని చేశారంటే..

ABN , First Publish Date - 2022-08-20T01:06:35+05:30 IST

ఆ అమ్మాయిలిద్దరూ ఒకే కాలనీలో నివసించేవారు.. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి వివాహిత..

Unique Love Story: పెళ్లికాని అమ్మాయి.. పెళ్లయిన ఓ యువతితో ప్రేమలో పడితే.. చివరకు ఇద్దరూ కలిసి ఎంతపని చేశారంటే..

ఆ అమ్మాయిలిద్దరూ ఒకే కాలనీలో నివసించేవారు.. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి వివాహిత.. ఇద్దరూ కలిసి చదువుకునేవారు.. ఆ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు.. కలిసి జీవించాలనుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకుని ఇళ్ల నుంచి పారిపోయారు.. చివరకు పోలీసులకు దొరికిపోయారు.. వారి ప్రేమకథ స్థానికంగా సంచలనం కలిగించింది.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హర్దోయ్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు వీడియో కాల్.. తీవ్ర మనస్తపానికి గురైన భర్త ఎంత పని చేశాడంటే.. పిల్లలకు విషం తాగించి..


హర్దోయ్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల వివాహిత, 19 ఏళ్ల యువతి ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ప్రతిరోజూ కలిసి చదువుకునేవారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు. ఇళ్ల నుంచి పారిపోయారు. వివాహిత అయిన యువతి తన ఇంట్లో ఉన్న నగలు పట్టుకుపోయింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇద్దరు అమ్మాయిల ఫోన్‌లను పోలీసులు ట్రేస్ చేయగా వారి మొబైల్స్ లొకేషన్ ఫరూఖాబాద్‌ అని చూపించింది. 


ఫరూఖాబాద్ వెళ్లిన పోలీసులు ఆ అమ్మాయిలిద్దరినీ పట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఆ యువతులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆ ఇద్దరు అమ్మాయిలతోనూ, వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతున్నారు. 


Updated Date - 2022-08-20T01:06:35+05:30 IST