షాకింగ్ వీడియో.. రెండు తలల పాము ఒకేసారి రెండు ఎలుకలను మింగేసింది..!

ABN , First Publish Date - 2021-07-26T17:15:34+05:30 IST

పాములంటే చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు.

షాకింగ్ వీడియో.. రెండు తలల పాము ఒకేసారి రెండు ఎలుకలను మింగేసింది..!

పాములంటే చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు. పాము వీడియోలు చూడాలన్నా చాలా మందికి భయమే. తాజాగా ఓ స్నేక్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో పాముకు రెండు తలలున్నాయి. ఆ పాము రెండు తలలతోనూ ఒకేసారి రెండు ఎలుకలను తింటోంది. 


ఈ వీడియోను అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ బ్రియాన్ బార్క్ జిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉండడంతో పాటు ఆసక్తికరంగానూ ఉండడంతో చాలా మంది చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-07-26T17:15:34+05:30 IST