Mahzooz raffle: ఇద్దరు భారతీయులకు జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నారంటే..

ABN , First Publish Date - 2022-08-25T16:35:00+05:30 IST

మహజూజ్ రాఫెల్ డ్రాలో (Mahzooz raffle draw) మరో ఇద్దరు భారతీయులకు జాక్‌పాట్(Jackpot) తగిలిగింది.

Mahzooz raffle: ఇద్దరు భారతీయులకు జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నారంటే..

దుబాయ్: మహజూజ్ రాఫెల్ డ్రాలో (Mahzooz raffle draw) మరో ఇద్దరు భారతీయులకు జాక్‌పాట్(Jackpot) తగిలిగింది. తాజాగా నిర్వహించిన మహజూజ్ 90వ వీక్లీ డ్రాలో డేవిడ్, రాబర్ట్ అనే ఇద్దరు భారత వ్యక్తులు చెరో 1లక్ష దిర్హమ్స్(రూ.21.73లక్షలు) గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకులో ఐటీ మేనేజర్‌గా పని చేస్తున్న 39 ఏళ్ల డేవిడ్ (David) తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి ఆరేళ్ల నుంచి యూఏఈలో (UAE) నివాసం ఉంటున్నాడు. స్నేహితుల సూచన మేరకు 2021 ఆగస్టు నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు మొత్తం నాలుగు సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే, నాలుగో సారికే ఆయనకు అదృష్టం వరించింది. దాంతో తాజాగా నిర్వహించిన డ్రాలో అతడు రూ.21.73లక్షలు గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన డేవిడ్.. ఈ నగదును తన ఫ్యామిలీ భవిష్యత్ కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. 


మరో విజేత రాబర్ట్ (55) గత 20 ఏళ్ల నుంచి యూఏఈ (UAE) ఉంటున్నట్లు తెలిపాడు. దుబాయ్‌ (Dubai)లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆర్థిక సలహాదారుగా (Financial advisor) పనిచేసే రాబర్ట్ 2021 అక్టోబర్ నుంచి క్రమం తప్పకుండా మహజూజ్ డ్రాలో (Mahzooz draw) పాల్గొంటున్నాడు. కానీ, ఇంత త్వరగా తనకు జాక్‌పాట్ తగులుతుందని అనుకోలేదని, భార నగదు గెలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. తాను గెలిచిన ఈ భారీ మొత్తాన్ని ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు. కానీ, ఇందులో కొంత భాగాన్ని తప్పకుండా తన పిల్లల చదువులకు ఉపయోగిస్తానని తెలిపాడు. 

Updated Date - 2022-08-25T16:35:00+05:30 IST