భక్తజన కొండ గోల్కొండ

ABN , First Publish Date - 2022-07-04T17:01:17+05:30 IST

గోల్కొండ కోట భక్తజన సంద్రమైంది. బోనాల జాతర రెండో పూజకు భక్తులు ఆదివారం పోటెత్తారు. సుమారు రెండు లక్షల మంది

భక్తజన కొండ గోల్కొండ

అమ్మవారిని దర్శించుకున్న రెండు లక్షల మంది భక్తులు

ఢిల్లీకి బంగారు బోనం


హైదరాబాద్/లంగర్‌హౌజ్‌: గోల్కొండ కోట భక్తజన సంద్రమైంది. బోనాల జాతర రెండో పూజకు భక్తులు ఆదివారం పోటెత్తారు. సుమారు రెండు లక్షల మంది అమ్మవారిని దర్శించుకొని సాకలు, నైవేద్యాలు, బోనాలు సమర్పించారు. కోటపై గల జగదాంబిక అమ్మవారి దర్శనానికి భారీ స్థాయిలో క్యూ కట్టారు. అప్పు డప్పుడు కురిసిన చిరుజల్లుల మధ్య బోనాల సమర్పణ, పోతరాజుల విన్యాసాలతో కోటలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. 

తొక్కిసలాట 

బోనాల ఉత్సవాలకు ఊహించని విధంగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు లాఠీలకు పని చెప్పారు. 

లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని మహాకాళి మాత దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ఆవరణలోని అమ్మవారి ఆలయంలో బంగారు బోనం సమర్పించనున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ ప్రతినిధులు ఆదివారం పాతబస్తీ నుంచి ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళారు. 


విజయవాడ దుర్గమ్మకు..

పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేశ్‌ తివారి ఆధ్వర్యంలో ఆదివారం విజయ వాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం, పట్టు వస్ర్తాలు, ఒడి బియ్యం సమర్పిం చారు. గంగ తెప్ప పూజా కార్యక్రమా న్ని నిర్వహించారు. పాతబస్తీ నుంచి విజయవాడ కనకదుర్గకు సామూహిక బోనాలు సమర్పించడం ఆనవాయితీ గా వస్తోంది. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు క్రాంతికుమార్‌, మధు సూదన్‌ యాదవ్‌, రాజారత్నం, అంజయ్య, మధుసూదన్‌ గౌడ్‌, ఆనంద్‌ రావు, మహేశ్‌రావు, జమ్మిచెట్టు రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T17:01:17+05:30 IST