రైతులకు రెండులక్షల రుణమాఫీ

ABN , First Publish Date - 2022-05-28T05:39:03+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాణీ చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

రైతులకు రెండులక్షల రుణమాఫీ
రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

రచ్చబండకార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాయికల్‌, మే 27: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాణీ చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఇటిక్యాల గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యం లోనిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ 2004-14 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్‌ అయిల్‌ ధర 110డాలర్లు ఉండగా ఇప్పుడు కూడా అదే ధర ఉందని అప్పుడు 500రూపాయలకు గ్యాస్‌, 50, 60రూపాలయలకు పెట్రోల్‌, డీజిల్‌ లభిం చాయని ఇప్పుడు మాత్రం అవి 1050, 120, 110రూపాయల ధరలకు అభిస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు రాయితీ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పాత ధరలకే వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ అందిస్తామని అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా స్వశక్తి సంఘాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకు తిరుగుతున్నాయని అధికారంలోకి రాగానే వరికి క్వింటాలుకు రూ.2500మద్ధతు ధరతోకొనుగోలు చేస్తామని, మార్క్‌ఫెడ్‌ ద్వారా ధాన్యం, పప్పు దినుసులకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని అన్నారు.  ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటల భీమా, నష్ట పరిహారం ఇచ్చిన ఎకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని, మహిళలకు, కూ లీల కోసం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టింది కాం గ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ ద్వారా రూ. లక్ష కాదు మాప్రభుత్వం అధికారంలోకి రాగానే జంటకు లక్ష రూపాయలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందిస్తామని అన్నారు. ప్రభుత్వ పరంగా పేదలకు 100శాతం ఉచితంగా వైద్యం ఏటీఎం లాగా ఎనీటైమ్‌ ఆరోగ్యశ్రీని కల్పిస్తామని అన్నారు. రైతులు, రైతు కూలీలు కాం గ్రెస్‌ పార్టీకి రెండు కళ్లని అన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీంధర్‌రావు, మహేంధర్‌గౌడ్‌, మాజీ జడ్పీ టీసీ గోపి మాధవి, ఎంపీటీసీ రాధ ఆదిరెడ్డి, నాయకులు గోపి రాజరెడ్డి, గంగరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌, భాషా పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T05:39:03+05:30 IST