2లక్షలమంది ఉక్రెయిన్ పిల్లల్ని రష్యా తీసుకువెళ్లింది...Zelenskyy ఆందోళన

ABN , First Publish Date - 2022-06-02T13:00:36+05:30 IST

ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాపై సంచలన వ్యాఖ్యలు చేశారు....

2లక్షలమంది ఉక్రెయిన్ పిల్లల్ని రష్యా తీసుకువెళ్లింది...Zelenskyy ఆందోళన

కైవ్: ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అనాథ ఆశ్రమాలు, కుటుంబాల నుంచి 2 లక్షల మంది పిల్లల్ని రష్యా బలవంతంగా తీసుకువెళ్లిందని జెలెన్స్కీ(Zelenskyy) చెప్పారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి జెలెన్స్కీ  చేసిన వీడియో ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధభూమిలో రష్యా ఉక్రెయిన్‌ను జయించలేమని, ప్రజలు లొంగిపోరని భావించి మా దేశ పిల్లల్ని బలవంతంగా తీసుకువెళ్లారని జెలెన్స్కీ ఆరోపించారు.  Ukrainian దేశ పిల్లలు రష్యా ఆక్రమణదారుల ఆస్తి కాలేరని జెలెన్స్కీ చెప్పారు. యుద్ధంలో ఇప్పటివరకు 243 మంది పిల్లలు మరణించారని, 446 మంది గాయపడ్డారని, 139 మంది పిల్లలు తప్పిపోయారని జెలెన్స్కీ చెప్పారు. 


రష్యా దళాలు ఆక్రమించిన ప్రాంతాల పరిస్థితి గురించి తన ప్రభుత్వానికి పూర్తి చిత్రం లేనందున ఇది మరింత ఎక్కువ కావచ్చుని ఆయన చెప్పారు.రష్యా పలువురు ఉక్రెయిన్ పిల్లల్ని వారి కుటుంబాల నుంచి విడదీసి రష్యా తరలించుకువెళ్లారని జెలెన్స్కీ వివరించారు.


Updated Date - 2022-06-02T13:00:36+05:30 IST