రెండక్షరాల పెళ్లి.. 2 గంటల పెళ్లి!

ABN , First Publish Date - 2021-06-17T07:21:45+05:30 IST

కల్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదంటారు. అందుకే కాబో లు అంతటా కమ్మేసిన ఈ కరోనా కాలంలోనూ కల్యాణాలు ఆగకుండా జోరుగా జరుగుతున్నాయి.

రెండక్షరాల పెళ్లి.. 2 గంటల పెళ్లి!

  • కరోనా కాలంలో మారిన వేడుక ముఖచిత్రం.. వాట్సా్‌పలో ఆహ్వానం 
  • సెల్లార్లు, లాన్స్‌, టెర్ర్‌సలూ కల్యాణ వేదికలే
  • పన్నీరు పోయి శానిటైజర్లు
  • కౌగిలింతలు, కబుర్లు పోయి భౌతికదూరం
  • మెరిసే అతివలకు మాస్కులు
  • వేదిక మీద వధూవరులు, పురోహితుడే 


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కల్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదంటారు. అందుకే కాబో లు అంతటా కమ్మేసిన ఈ కరోనా కాలంలోనూ కల్యాణాలు ఆగకుండా జోరుగా జరుగుతున్నాయి. కాకపోతే కల్యాణ వేదిక, పెళ్లి పీటల మీద వధూవరులు, తాళి, జీలకర్రబెల్లం, పురోహితుడి మంత్రోచ్ఛారణలు, అప్పగింతలు తప్ప సంప్రదాయ వివాహ వేడుకలో కనిపిం చే హంగూ ఆర్భాటాలేవీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పట్టుచీరలు, నగల్లో మెరిసిపోతూ పందిరంతా తెగే తిరిగే తరుణులు లేరు. అక్కడక్కడా నాలుక్కుర్చీలేసుకొని చాయ్‌ తాగుతూ కబుర్లు చెప్పుకొనే బ్యాచ్‌లు లేవు. ఉరుకుల పరుగులతో గోల గోల చేసే పోరగాళ్లు లేరు. ముహూర్తం సమీపిస్తున్న వేళ వధూవరుల వె నుక చేరి హడావిడి చేసే అతివలూ లేరు. అత్తింటికి వెళుతూ కన్నీరు పెట్టుకునే పెళ్లికూతురును ఆప్యాయంగా ఓదార్చే అమ్మలక్కలూ లేరు. మొత్తంగా హల్దీ, మెహందీ, సంగీత్‌ వంటి కార్యక్రమాలేవీ లేకుండా రెండక్షరాల ‘పెళ్లి’, ఈ రోజు రెండు గంటల తంతుగా మారిపోయింది. రెండేళ్ల క్రితం దాకా ఎవ్వరూ ఊహించని మార్పిది. 


కరోనా కాలంలో ఈ మార్పు మంచికే! 

ఈ రోజుల్లో పెళ్లిళ్లలో ఆర్భాటాల కన్నా శుభ్రత, భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారు. వందలు, వేలల్లో అతిథులను పిలిచే సంప్రదాయం పోయింది. పెళ్లి పత్రిక లు పంచే సంస్కృతికి కాలం చెల్లింది. వాట్సా్‌ప లో ఆహ్వానిస్తున్నారు.  వేడుకకు వెళితే సంతోషిస్తున్నారు. వెళ్లకుండా సామాజిక మాధ్యమాల్లో లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా చూస్తూ ఆశీస్సులు అందజేస్తే మరీ సంతోషిస్తున్నారు. వేలమంది బంధువులు, అతిథుల మధ్య వేడుక 40-50 మంది వ్యవహారంలా మారిపోయింది.


ఈ మార్పు మంచికే! 

‘ఆకాశమంత పందిరి.. భూదేవం త వేదిక’ అనే మాట పెళ్లి ఆర్భాటా న్ని చాటే నానుడి! అయితే బడా ఫంక్షన్‌ హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లే కాకుండా అపార్ట్‌మెంట్‌ సెల్లా ర్లు, ఇంటి ముంగిట లాన్లు, టెర్రస్‌ గార్డెన్లు కూడా ఇ ప్పుడు వివాహ వేదికలవుతున్నాయి. పెళ్లిళ్లలో భారీ త నం కనిపించడం బాగా తగ్గిపోయింది. ఎలా చేసుకుం టే ఏమిటి? ఎక్కడ చేసుకుంటే ఏమిటి? అని అడిగేవా రు పెరిగారు. గాలి ధారాళంగా వచ్చే ప్రదేశాల్లో పెళ్లి మంచిందంటున్నారు. అందుకే హోటళ్లలో కూడా లాన్స్‌ అయితే బెస్ట్‌ అంటున్నారు. సాధారణ వివాహాల్లో జ్వర పరీక్షలు జరగడం లేదు కానీ వెడ్డింగ్‌ ప్లానర్లు వివా హం చేస్తే జ్వర పరీక్షలు మస్ట్‌! వివాహ వేదిక ప్రవే శం దగ్గర ఈ పరీక్షలు నిర్వహించే రోజులొచ్చాయి. ఈ మార్పు మంచికే! అత్తరు పరిమళాలు లేని పెళ్లి సంద డి ఉంటుందా? కానీ పాపం పన్నీరుకూ ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆ స్థానంలో శానిటైజర్‌ వచ్చి చేరింది. 


వెడ్డింగ్‌ మెనూ అంటే కనీసం 40-50 వెరైటీలు ఉండాలని మునుపు అనుకునేవారు. ఇప్పుడు భోజనం లో ఎన్ని రకాల రుచులుండాలని అని కాదు.. ఆ తిండి ఆరోగ్యానికి ఎంత మంచిది? అనే ఆలోచన పెరిగింది. బఫేల కన్నా ప్లేటెడ్‌ మీల్స్‌కు క్రేజ్‌ పెరిగింది. అల్పాహారంగా ఇడ్లీ, దోసెలతో పాటుగా బాదాంలు, వాల్‌నట్స్‌ లాంటి డ్రైప్రూట్స్‌ కూడా చేరాయి. సలాడ్‌ల కన్నా ఫ్రెష్‌ కట్‌  ఫ్రూట్స్‌కే ప్రాధాన్యం పెరిగింది. ఈ మార్పు మంచికే! 


ఆర్భాటం కన్నా భద్రతకే ప్రాధాన్యం

కరోనా కాలంలోనూ ఖర్చుకు క్లయింట్స్‌ పెద్దగా వెనుకాడటం లేదు. అయితే ఖర్చు కన్నా ప్రధానంగా భద్రతకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. హంగూ అర్భాటం కన్నా ముందు పెళ్లయితే చాలనే భావనలో చాలామంది ఉన్నారు. అందుకే టెర్ర్‌సలు, లాన్‌లు, బ్యాక్‌యార్డ్‌లు కూడా వేదికలవుతున్నాయి. మినిమిలిస్టిక్‌ డెకార్‌ ట్రెండ్‌ నడుస్తుందిప్పుడు. సింపుల్‌గా ఉండాలి, క్యూట్‌గా కనిపించాలంటున్నారు. భౌతిక దూరం పెరిగింది. మాస్క్‌ కస్టమైజేషన్‌తో పాటుగా శానిటైజేషన్‌ కస్టమైజేషన్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్యాక్‌ లంచ్‌లు ఇస్తున్నారు. రిటర్న్‌ గిఫ్ట్స్‌ కూడా అదే తరహాలో జరుగుతున్నాయి. డ్రెస్‌ల మీద మాత్రం అభిరుచి మారలేదు. 

 - ఫణి, ఎల్లో ప్లానర్స్‌ 

Updated Date - 2021-06-17T07:21:45+05:30 IST