అక్రమ సంబంధం వద్దన్నందుకు స్నేహితుడిపైనే కాల్పులు

ABN , First Publish Date - 2020-12-10T12:45:13+05:30 IST

భార్య, సోదరితో అక్రమసంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్నేహితుడినే హతమార్చేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను....

అక్రమ సంబంధం వద్దన్నందుకు స్నేహితుడిపైనే కాల్పులు

ఘజియాబాద్ : భార్య, సోదరితో అక్రమసంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్నేహితుడినే హతమార్చేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ వర్మ అనే స్నేహితుడిపై నదీమ్, అజయ్ లు హత్యా యత్నం చేశారు. ఢిల్లీలోని నాంగ్లోయిలోని ఒక ఫ్లాటులో అజయ్, నదీమ్, మనోజ్ వర్మలు కలిసి నివశించారు.కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో నదీం, అజయ్ లు మనోజ్ వర్మ ఇంటికి వచ్చారు. మనోజ్ వర్మ భార్యతో నదీమ్, సోదరితో అజయ్ లు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. దీనిపై మనోజ్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నదీమ్, అజయ్ లు కలిసి వర్మను చంపేందుకు యత్నించారు. నదీం, అజయ్ లను అరెస్టు చేసి, వారి నుంచి పిస్టల్, రెండు లైవ్ కాట్రిడ్జులను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఇరాజ్ రాజా చెప్పారు. 

Updated Date - 2020-12-10T12:45:13+05:30 IST