కాలేజీకి నడుచుకుంటూ వెళ్తున్న యువతిని బలవంతంగా బైక్ ఎక్కించారు.. ఆమె వారిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందంటే..

ABN , First Publish Date - 2021-12-06T19:36:50+05:30 IST

ఆమె ఇంటర్మీడియెట్ చదువుతున్న యువతి.. ఇంటి నుంచి కాలేజీకి రోజు నడుచుకుంటూ వెళ్తుంటుంది..

కాలేజీకి నడుచుకుంటూ వెళ్తున్న యువతిని బలవంతంగా బైక్ ఎక్కించారు.. ఆమె వారిని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందంటే..

ఆమె ఇంటర్మీడియెట్ చదువుతున్న యువతి.. ఇంటి నుంచి కాలేజీకి రోజూ నడుచుకుంటూ వెళ్తుంటుంది.. ఐదు రోజుల క్రితం కూడా ఎప్పటిలాగానే నడుచుకుంటూ కాలేజీకీ వెళ్తోంది.. ఆ సమయంలో ఇద్దరు దుండగులు బైక్‌పై ఆమె దగ్గరకు వచ్చారు.. తుపాకీ చూపించి ఆమెను బలవంతంగా బైక్ ఎక్కించుకున్నారు.. కొద్ది దూరం వెళ్లాక బైక్‌ను ఆమె అటూ ఇటూ ఊపి ఇద్దరినీ కింద పడేసింది.. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.. పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని పట్టుకోవడంలోనూ సహకరించింది. 


రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన 17 ఏళ్ల బాలికను రోహిత్ యాదవ్, హేమంత్ యాదవ్ అనే ఇద్దరు నిందితులు గత బుధవారం కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై నడుస్తున్న బాలికను అడ్డగించి తుపాకీ చూపించి ఆమెను బలవంతంగా బైక్ ఎక్కించుకున్నారు. అయితే ఆమె బైక్‌ను బ్యాలెన్స్ తప్పేలా చేసి కింద పడేసింది. అక్కడి నుంచి పారిపోయింది. బైక్ నెంబర్, వారి గుర్తులు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. 


వారిద్దరూ ఇప్పటికే అనేక కేసుల్లో నిందితులుగా తేలింది. స్థానిక ఎమ్మెల్యేను బెదిరించిన కేసులో హేమంత్ యాదవ్ ఇప్పటికే నిందితుడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. అది కాకుండా అతనిపై మరో నాలుగు కేసులు ఉన్నాయి. ఇక, తన జన్మదినోత్సవం రోజున తుపాకీతో కాల్పులు జరిపి కలకలం సృష్టించిన రోహిత్‌పై మూడు కేసులు ఉన్నాయి. తప్పించుకు తిరుగుతున్న వీరిద్దరూ బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు.  

Updated Date - 2021-12-06T19:36:50+05:30 IST