ఇద్దరు ఎమ్మెల్యేలకు Covid పాజిటివ్‌

Published: Wed, 12 Jan 2022 11:01:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇద్దరు ఎమ్మెల్యేలకు Covid పాజిటివ్‌

అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. అదేసమయంలో ఈ వైరస్‌బారిన పడుతున్నవారిలో అనేక మంది ప్రముఖులున్నారు. తాజాగా, తిరుప్పూరు (ఉత్తరం) అసెంబ్లీ స్థానానికి చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయకుమార్‌ (60)కు కరోనా వైరస్‌ సోకింది. అలాగే, తిరుపత్తూరు శాసనసభ్యుడు నల్లతంబికి కూడా ఈ వైరస్‌ సోకినట్టు తేలింది. వీరిద్దరూ ఇటీవల జరిగి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తమ సొంతూర్లకు వెళ్ళారు. అక్కడ అస్వస్థతకు లోనుకావడంతో వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వారికి కరోనా నిర్థారణ అయింది. దీంతో వారిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.