2 నెలల్లో.. రూ.2వేల కోట్లు...

ABN , First Publish Date - 2022-06-05T17:34:11+05:30 IST

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పన్నుల వసూళ్లలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం

2 నెలల్లో.. రూ.2వేల కోట్లు...

                - పన్నుల వసూళ్లలో బీబీఎంపీ Bbmp సరికొత్త రికార్డు


బెంగళూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పన్నుల వసూళ్లలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేవలం రెండు నెలల వ్యవధిలో రూ. 2వేల కోట్ల వసూలు సాధ్యమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 3,475 కో ట్ల వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి రెండు నెలల్లోనే రూ.2వేల కోట్లు సాధ్యం కావడంతో 58 శాతం లక్ష్యం అందుకున్నట్టు బీబీఎంపీ స్పెషల్‌ కమిషనర్‌ (రెవెన్యూ) ఆర్‌ఎల్‌ దీపక్‌ ప్రకటించారు. పన్నుల వసూళ్లకు సంబంధించి సంస్కరణలతోనే సాధ్యమైందని ఆయన శనివారం మీడియాకు వివరించారు. డివిజన్ల వారీగా ఎంపిక చేసుకుని పన్నుల వసూళ్లను సరళీకృతం చేశామన్నారు. ఖాళీ స్థలాలుగా బీబీఎంపీకి చూపి పన్ను ఎగవేసే వారిని కట్టడి చేశామన్నారు. విద్యుత్‌ బిల్లులతో ప్రతి ఇంటి పన్నును బేరీజు వేశామన్నారు. త ద్వారా పన్నుల ఎగవేత దారులను కట్టడి చేసినట్టయిందని వివరించారు. దీనికితోడు డ్రోన్లను ఉపయోగించి ఖాళీ స్థలమా, నివాసమా, కమర్షియల్‌ కాంప్లెక్స్ వంటి వాటిపై సర్వే జరిపించామన్నారు. ఆ తర్వాత అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించే నిబంధన పెట్టడంతో ప్రజలు అప్రమత్తమయ్యారన్నారు. ఇలా పన్నుల వసూళ్లు పెరిగేందుకు సాధ్యమైందని వివరించారు. 

Updated Date - 2022-06-05T17:34:11+05:30 IST