బెంగళూరుకు మరో రెండు బస్సులు

ABN , First Publish Date - 2022-05-18T05:06:32+05:30 IST

కడప - బెంగుళూరు కు 21నుంచి మరో రెండు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు, కడప - విజయవాడ సర్వీసుకు నగరంలో బోర్డింగ్‌ పాయింట్స్‌ (పికప్‌ పాయింట్స్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గోపీనాధ్‌రెడ్డి పేర్కొన్నారు.

బెంగళూరుకు మరో రెండు బస్సులు
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న గోపీనాధ్‌రెడ్డి

విజయవాడ సర్వీసుకు పికప్‌ పాయింట్స్‌ : ఈడీ గోపీనాధ్‌రెడ్డి

కడప మారుతీనగర్‌, మే17: కడప - బెంగుళూరు కు 21నుంచి మరో రెండు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు, కడప - విజయవాడ సర్వీసుకు నగరంలో బోర్డింగ్‌ పాయింట్స్‌ (పికప్‌ పాయింట్స్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గోపీనాధ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌ఎం ఛాంబర్‌లో విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ వెళ్లే అమరావతి బస్సు కడప డిపో నుం చి బయలుదేరి పాతబస్టాండు బయట, సెవెన్‌ రోడ్స్‌, బిల్టప్‌, చెన్నూరు బస్టాండు, వినాయక్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో ఆగుతూ ప్రయాణీకులను పిక ప్‌ చేసుకుంటుందన్నారు. అమరావతి బస్సు బద్వే ల్‌ క్రాస్‌రోడ్డు మీదుగా ఒంగోలు, గుంటూరు, విజయవాడకు తెల్లవారుజామున 5 గంటలకు చేరుతుందన్నారు. కడప నుంచి విజయవాడకు వెళ్ళే ఇంద్ర బస్సు మైదుకూరు బస్టాండు మీదుగా బద్వే ల్‌, ఒంగోలు, గుంటూరు, విజయవాడ చేరుకుంటుందన్నారు.

21 నుంచి బెంగళూరుకు....

 21వ తేదీ శనివారం నుంచి కడప - బెంగళూరు కు ప్రస్తుతం ఉన్న రెండు అమరావతి  ఏసీ బస్సులకు అదనంగా మరో రెండు అమరావతి బస్సుల ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బస్సు లు రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఒకటి, రాత్రి 10-30కు ఒకటి కడప డిపో నుంచి బయలుదేరుతాయన్నారు. ఇవి కాకుండా కడప- చిత్తూరు ప్రాం తానికి కూడా త్వరలో అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కడప రీజనల్‌ మేనేజర్‌ గోపాల్‌రెడ్డి, కడపడిపో మేనేజర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:06:32+05:30 IST