రెండే నామినేషన్లు

ABN , First Publish Date - 2021-03-01T04:59:09+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. ఆదివారం 3 గంటల వరకు గడువిచ్చారు. ఈలోగా రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. గతేడాది మార్చి నెలలో నామినేషన్లు వేసిన తరువాత మృతి చెందిన వారి స్థానంలో అదే పార్టీకి చెందిన వారి నుంచి నామినేషన్ల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది.

రెండే నామినేషన్లు
నెల్లిమర్ల నగర పంచాయతీలో నామినేషన్ల స్వీకరణ కోసం సిద్ధంగా ఉన్న ఎన్నికల సిబ్బంది

పార్వతీపురంలో ఒకటి.. విజయనగరంలో మరొకటి

నెల్లిమర్లలో నిల్‌.. నేడు పరిశీలన

(విజయనగరం- ఆంధ్రజ్యోతి) 

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. ఆదివారం 3 గంటల వరకు గడువిచ్చారు. ఈలోగా రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. గతేడాది మార్చి నెలలో నామినేషన్లు వేసిన తరువాత మృతి చెందిన వారి స్థానంలో అదే పార్టీకి చెందిన వారి నుంచి నామినేషన్ల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం మన్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో నామినేషన్ల స్వీకరణకు జిల్లా ఎన్నికల అధికారి చర్యలు చేపట్టారు. విజయగనరంలో 21వ డివిజన్‌ నుంచి వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా కనకల నాగవళ్లి నామినేషన్‌ వేశారు. అలాగే పార్వతీపురంలో ఒకటో వార్డు నుంచి బత్తుల శ్రీదేవి నామినేషన్‌ వేశారు. కాగా నెల్లిమర్ల నగర పంచాయతీలో 2వ వార్డులో నామినేషన్‌ వేసిన పైల నందిని.. 11వ వార్డులో ఎన్‌.రామారావు, 14వ వార్డులో జాన కాశీవిశ్వరరావులు నామినేషన్‌ వేసిన తరువాత మృతి చెందారు. ఈ మూడు వార్డుల నుంచి గడువులోగా ఒక్క నామినేషన్‌ కూడా వేయలేదు. దీనికి కారణం చనిపోయిన అభ్యర్థుల వార్డుల్లో ఇదివరకు డమ్మీ అభ్యర్థులుగా వారి వారి కుటుంబ సభ్యులు నామినేషన్లను అప్పట్లోనే వేశారు. దీంతో డమ్మీ అభ్యర్థులను తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు వైసీపీ నిర్ణయించింది. నామినేషన్లు కొత్తగా వేయకపోయినా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నట్లే ఆ పార్టీ నిర్ణయించి బి ఫారాలు మంజూరు చేయనుంది. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసినట్టే. ఒకటో తేదీన కొత్తగా వేసిన నామినేషన్ల పరిశీలన, 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టానికి అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఇక మున్సిపల్‌ ఎన్నికలు మరింత వేడెక్కనున్నాయి.

  


Updated Date - 2021-03-01T04:59:09+05:30 IST