Two Pakistan boxers go missing: కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లిన ఇద్దరు పాక్ బాక్సర్లు మిస్సింగ్

ABN , First Publish Date - 2022-08-11T16:46:33+05:30 IST

కామన్వెల్త్ క్రీడలు2022(Commonwealth Games2022)లో పాల్గొనేందుకు పాకిస్థాన్(Pakistan) దేశం నుంచి బర్మింగ్ హామ్(Birmingham)వెళ్లిన ఇద్దరు బాక్సర్లు(Two boxers) జాడ లేకుండా...

Two Pakistan boxers go missing: కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లిన ఇద్దరు పాక్ బాక్సర్లు మిస్సింగ్

లాహోర్ (పాకిస్థాన్): కామన్వెల్త్ క్రీడలు2022(Commonwealth Games2022)లో పాల్గొనేందుకు పాకిస్థాన్(Pakistan) దేశం నుంచి బర్మింగ్ హామ్(Birmingham)వెళ్లిన ఇద్దరు బాక్సర్లు(Two boxers) జాడ లేకుండా పోయారు(disappearance). కామన్వెల్త్ క్రీడలు ముగిసినా పాక్ బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లాఖాన్ ల ఆచూకీ లభించలేదని, వారు అదృశ్యమయ్యారని పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ పాక్ జట్టు నిర్వహణ అధికారులకు చెప్పింది. జాడ లేకుండా పోయిన(missing in United Kingdom) పాక్ బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లాఖాన్ ల గురించి(Two Pakistan boxers go missing) యూకేలోని పాకిస్థాన్ హై కమిషన్ కు, లండన్ అధికారులకు పాక్ బాక్సింగ్ ఫెడరేషన్(Pakistan Boxing Federation) తెలిపింది. 


కామన్వెల్త్ క్రీడలు ముగిశాక పాక్ క్రీడాకారులందరూ లండన్ బర్మింగ్ హామ్ నుంచి ఇస్లామాబాద్ కు విమానంలో బయలుదేరగా, ఇద్దరు బాక్సర్లు జాడ లేకుండా పోయారని పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ కార్యదర్శి నసీర్ టాంగ్ చెప్పారు.బర్మింగ్ హామ్ క్రీడలు ముగిశాక జాడ లేకుండా పోయిన ఇద్దరు బాక్సర్ల ప్రయాణ డాక్యుమెంట్లు, వారి పాస్ పోర్టులు బాక్సింగ్ ఫెడరేషన్ వద్ద ఉన్నాయని నసీర్ పేర్కొన్నారు.క్రీడలు ముగిశాక పాక్ క్రీడాకారులు స్వదేశానికి చేరినా, ఇద్దరు బాక్సర్లు మాత్రం మిస్ అయ్యారని పాక్ బాక్సింగ్ ఫెడరేషన్ యూకే అధికారులకు ఫిర్యాదు చేసింది.



ఇద్దరు బాక్సర్ల అదృశ్యంపై దర్యాప్తు జరిపేందుకు పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్(Pakistan Olympic Association) నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది.(four-member committee to investigate the matter of the missing boxers) పాక్ బాక్సర్లు బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించలేక పోయారు. రెండు నెలల క్రితం హంగరీలో జరిగిన ఫీనా వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్న స్విమ్మర్ ఫైజాన్ అక్బర్ కూడా జాడ లేకుండా పోయాడు.   

Updated Date - 2022-08-11T16:46:33+05:30 IST