రెండు ముక్కలు..!

ABN , First Publish Date - 2022-01-27T07:00:48+05:30 IST

జిల్లాను రెండు ముక్కలుగా చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

రెండు ముక్కలు..!

రెండుగా జిల్లా విభజన

సత్యసాయి జిల్లాకు 6, అనంతకు 

8 నియోజకవర్గాలు..

కొత్త రెవెన్యూ డివిజన్లుగా పుట్టపర్తి, గుంతకల్లు 

ధర్మవరం రెవెన్యూ డివిజన గల్లంతు

అనంతపురం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాను రెండు ముక్కలుగా చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జి ల్లాలో అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాలున్నా యి. లోకసభ స్థానాల వారీగా జి ల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొంతకాలంగా వినిపిస్తున్న వి షయం తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హిందూపురం లోకసభ స్థానం పరిధిలో ఉ న్న ఏడు నియోజక వర్గాలకుగానూ రాప్తాడు ని యోజకవర్గం మినహా మిగిలిన 6 నియోజకవర్గాలతో కలిపి ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కేం ద్రంగా... శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సత్యసాయి జిల్లాలో 29 మండలాలు ఉండేలా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాగా కొనసాగుతున్న అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంతో కలిపి 8 నియోజకవర్గాలు, 34 మండలాలుగా కొనసాగనుంది.


విస్తీర్ణంలో భారీ వ్యత్యాసం...

లోకసభ స్థానాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఒక్కో జిల్లా ఏర్పాటుకు సంబంధించి విస్తీర్ణంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సత్యసాయి జిల్లా విస్తీర్ణం 7,721 చదరపు కి.మీలు, మాత్రమే ఉండగా.. జనాభా 17.22 లక్షలుగా ఉం డనుంది. అనంతపురం జిల్లా విస్తీర్ణం 11,359 చదరపు కి.మీ ఉంది. జనాభా 23.59 ల క్షలకు ఉంది. రెండు జిల్లాల విస్తీర్ణాన్ని బట్టి చూ స్తే... 3638 చదరపు కి.మీ., విస్తీర్ణం తేడా ఉంది. జనాభా విషయంలోనూ 6.37 లక్షల అనంత జి ల్లాలో అధికంగా ఉన్నారు. ఏ లెక్కన ఈ ప్రతిపాదనలు సిద్ధంచేశారో అర్థం కావడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


కొత్త రెవెన్యూ డివిజన్లుగా పుట్టపర్తి, గుంతకల్లు

జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త రెవెన్యూ డివిజన్లుగా గుంతకల్లు, పుట్టపర్తిని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో కదిరి రెవెన్యూ డివిజన పరిధిలో ఉన్న పుట్టపర్తి కొత్త రెవెన్యూ డివిజనగా ఏర్పాటు కానుంది. కొత్తగా ఏర్పాటవుతున్న పుట్టపర్తి రెవెన్యూ డివిజన పరిధిలోకి ఆ నియోజకవర్గంలోని నాలుగు మండలాలతోపాటు ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని మండలాలను విలీనం చేయనున్నారు. ఈ లెక్కన మొత్తం 8 మండలాలతో 2349 చదరపు కి.మీ., విస్తీర్ణంతో 4.85 లక్షల జనాభాతో పుట్టపర్తి రెవెన్యూ డివిజన ఏర్పాటు కానుంది. ఈనేపథ్యంలో ధర్మవరం రెవెన్యూ డివిజన గల్లంతు కానుంది. ఇప్పటివరకూ అనంతపురం రెవెన్యూ డివిజన పరిధిలో ఉన్న గుంతకల్లును కొత్తగా రెవెన్యూ డివిజనగా ఏర్పాటు చేయబోతున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండలాలతో కలిపి గుంతకల్లు రెవెన్యూ డివిజనను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 8 మండలాలు, 2807 చదరపు కి..మీ., విస్తీర్ణంతో 6.02 లక్షల జనాభాతో గుంతకల్లు కొత్త డివిజనగా రూపాంతరం చెందనుంది. ఇప్పటివరకూ హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం రెవెన్యూ డివిజన పరిధిలో ఉ న్న రాప్తాడు నియోజకవర్గంలోని చె న్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, రాప్తాడు మండలాలను అనంతపు రం రెవెన్యూ డివిజనలో విలీనం చేయబోతున్నారు. కాగా... కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు రెవెన్యూ డివిజన్లతో కలుపుకుంటే రెండు జి ల్లాలో మొత్తం 6 రెవెన్యూ డివిజన్లు కానున్నాయి.


ఏ జిల్లాలోకి ఏయే నియోజకవర్గాలు..

అనంత జిల్లా 8 నియోజకవర్గాలతో కొనసాగనుంది. అనంతపురం అర్బన, శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రాప్తాడు ని యోజకవర్గాలు అనంతపురం జిల్లా పరిధిలోకి రానున్నాయి. ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, హిందూపురం, కదిరి నియోజకవర్గాలతో సత్యసాయి జి ల్లా ఏర్పాటు కానుంది. 


రాప్తాడును అనంతలోకి చేర్చడంపై చర్చ...

రాప్తాడు నియోజకవర్గాన్ని అనంతపురం జిల్లాలోకి విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం రాజకీయ, మేధావి వర్గా ల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికార పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే రాప్తాడు ని యోజకవర్గాన్ని అనంతపురం జిల్లాలో కలిపేలా పావులు కదిపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూపురం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పరిటాల కుటుంబం ప్రభావం ఉంది. ఆ ప్రభావాన్ని పూర్తిస్థాయిలో నిలువరించాలనే కుట్రలో భాగంగానే రాప్తాడు నియోజకవర్గాన్ని అనంత జిల్లాలో కలిపారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-01-27T07:00:48+05:30 IST