కరోనా అధికారులమంటూ వచ్చి.. 54వేలకు టోపీ!

ABN , First Publish Date - 2020-07-06T03:57:59+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి అల్లాడిస్తోంది. ఈ వైరస్ విషయంలో అసత్య ప్రచారాలను అరికట్టేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి.

కరోనా అధికారులమంటూ వచ్చి.. 54వేలకు టోపీ!

ముంబై: దేశాన్ని కరోనా మహమ్మారి అల్లాడిస్తోంది. ఈ వైరస్ విషయంలో అసత్య ప్రచారాలను అరికట్టేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులను కూడా కొందరు దుర్మార్గులు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కరోనాతో అట్టుడికిపోతున్న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన తాజా సంఘటనే దీనికి ఉదాహరణ. ముంబైలోని చెంబూర్‌లో అబ్దుల్ షేక్ నివశిస్తున్నాడు. ఓ రోజు బయటకు వెళ్లిన అతన్ని ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. తాము కరోనా అధికారులమని, అందరినీ చెక్ చేయాలని చెప్పారు. అబ్దుల్ బ్యాగ్ మొత్తం చెక్ చేసి, ఏటీయం కార్డు దొంగిలించారు. అదే సమయంలో ఏటీయం పిన్ నంబరు కూడా తెలుసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికే తన ఖాతా నుంచి రూ.54వేలు విత్‌డ్రా అయినట్లు అబ్దుల్ గ్రహించాడు. తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-06T03:57:59+05:30 IST