రెండు ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌

ABN , First Publish Date - 2020-08-09T10:55:43+05:30 IST

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సెబ్‌ పోలీసులు శనివారం సీజ్‌ చేశారు.

రెండు ఇసుక ట్రాక్టర్‌ సీజ్‌

నెల్లూరు (రూరల్‌), ఆగస్టు 8 :  అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సెబ్‌ పోలీసులు శనివారం సీజ్‌ చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు ప్రాంతం నుంచి నగరంలోని రమే్‌షరెడ్డి నగర్‌కు ట్రాక్టర్‌ ఇసుకను తరలిస్తుండగా  పట్టుకున్నట్టు సెబ్‌ - 2 సీఐ సూరినారాయణ తెలిపారు. డ్రైవర్‌ వెల్తూరి గంగయ్యను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశామనీ, వేదాయపాళెం పోలీసులకు ట్రాక్టర్‌, డ్రైవర్‌ను అప్పగించామనీ  తెలిపారు. ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని కట్టకింద వడ్డిపాళెం వద్ద మరో ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. డ్రైవర్‌ నెల్లూరు గిరిబాబు  అదుపులోకి తీసుకుని ముత్తుకూరు పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. 

Updated Date - 2020-08-09T10:55:43+05:30 IST