గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మహావికాస్ అఘాడీ (MVA) కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjya Raut) ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు, శివసేన కూటమి వీడినా తమకు సమస్య లేదని, తాము మాత్రం ఎంవీఏతోనే ఉంటామని కాంగ్రెస్ (Congress) స్పష్టం చేసింది.
ఇంకోవైపు, గువాహటిలోని రాడిసన్ బ్లూ (Radisson Blu) హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సారథ్యంలోని రెబల్ క్యాంపు మాత్రం తమ పట్టువీడడం లేదు. కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు నుంచి బయటకు వచ్చి బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు దీపక్ వసంత్ కేశార్కర్ (Deepak Vasant Kesarkar), ఆశిష్ జైశ్వాల్ (Ashish Jaiswal) రెబల్ క్యాంపు నుంచి బయటకు వచ్చేశారు. అయినప్పటికీ హోటల్‌లో ఇంకా 40 మంది ఎమ్మెల్యేలు ఇంకా రెబల్ క్యాంపులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి