Pakistan మసీదులో విద్యుత్ కోతపై వాగ్వాదం...కాల్పుల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-07-02T13:10:22+05:30 IST

పాకిస్థాన్ దేశంలోని ఓ మసీదులో విద్యుత్తు అంతరాయం కారణంగా జరిగిన వాగ్వాదం కాల్పులకు దారితీసింది....

Pakistan మసీదులో విద్యుత్ కోతపై వాగ్వాదం...కాల్పుల్లో ఇద్దరి మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ దేశంలోని ఓ మసీదులో విద్యుత్తు అంతరాయం కారణంగా జరిగిన వాగ్వాదం కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 11మంది గాయపడ్డారు.ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పాకిస్తాన్ వాయువ్య గిరిజన జిల్లాలోని ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనల తర్వాత భక్తుల మధ్య భారీ విద్యుత్తు అంతరాయంపై వాగ్వాదం జరిగింది. ఈ వాదన కాల్పులకు దారితీసింది.లక్కీ మార్వాట్ జిల్లాలోని ఈసాక్ ఖేల్ ప్రాంతంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత భక్తుల బృందం మధ్య తమ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయాలపై తీవ్ర వాగ్వాదం జరిగింది.ఈ ఘర్షణ కొద్దిసేపటికే హింసాత్మకంగా మారింది. కొంతమంది భక్తులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఆరేళ్ల చిన్నారితో సహా మరో 11 మంది గాయపడ్డారని పాకిస్థాన్ పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-07-02T13:10:22+05:30 IST