రెండు శిక్షణ విమానాలు ఢీకొని ముగ్గురు పైలెట్ల మృతి

Published: Fri, 01 Apr 2022 11:50:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రెండు శిక్షణ విమానాలు ఢీకొని ముగ్గురు పైలెట్ల మృతి

సియోల్ : దక్షిణ కొరియాలో రెండు వైమానిక దళ విమానాలు గాలిలో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించగా, మరొకరు గాయపడ్డారు. దక్షిణ కొరియా విమానాలు పైలెట్ల శిక్షణ సమయంలో గాలిలో ఢీకొన్నాయి.రెండు కేటీ-1 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఢీకొన్న తర్వాత ఆగ్నేయ నగరమైన సచియోన్ పర్వతంపై కూలిపోయిందని వైమానిక దళ అధికారులు చెప్పారు.మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు, డజన్ల కొద్దీ అత్యవసర సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు.కేటీ-1 రెండు సీట్ల విమానమని, విమానంలో పైలెట్లు సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించారని వైమానిక దళం ప్రకటించింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.