మధ్యాహ్నం అన్నం తిని స్కూలు బయటకు వెళ్లిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు.. మూడో రోజు అసలు నిజం తెలిసి..

ABN , First Publish Date - 2021-11-27T18:26:49+05:30 IST

వారిద్దరూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చి మధ్యాహ్నం వరకు ఉన్నారు..

మధ్యాహ్నం అన్నం తిని స్కూలు బయటకు వెళ్లిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు.. మూడో రోజు అసలు నిజం తెలిసి..

వారిద్దరూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చి మధ్యాహ్నం వరకు ఉన్నారు.. భోజనం తర్వాత ఇద్దరూ స్కూలు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి పబ్ జీ ఆడుకున్నారు.. ఆ తర్వాత నుంచి వారిలో ఒక విద్యార్థి కనిపించడం మానేశాడు.. దీంతో అతడి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరో విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.. దీంతో అసలు విషయం బయటపడింది.. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో ఈ ఘటన జరిగింది. 


సింగ్రౌలికి సమీపంలోని కోని గ్రామానికి చెందిన ఆశీష్ జైస్వాల్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం భోజనం తర్వాత తన స్నేహితుడితో కలిసి పాఠశాలకు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ పబ్ జీ ఆడడం ప్రారంభించారు. ఓడిపోయిన వారు రూ.50 ఇవ్వాలనే ఒప్పందంతో ఆట ప్రారంభించారు. ఆ ఆటలో ఆశిష్ ఓడిపోయాడు. అయితే డబ్బులు లేకపోవడంతో స్నేహితుడికి ఇవ్వలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. 


ఆ క్షణికావేశంలో స్నేహితుడు పెద్ద రాయి తీసి ఆశిష్ తలపై కొట్టాడు. దీంతో ఆశిష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో షాకైన నిందితుడు ఆశిష్‌ మృతదేహాన్ని చెరువులోకి విసిరేసి వెళ్లిపోయాడు. ఆశిష్ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. ఆశిష్‌తో చివరగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. 


Updated Date - 2021-11-27T18:26:49+05:30 IST