ఇరువురు దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2021-06-23T06:39:06+05:30 IST

చోరీలకు పాల్పడుతున్న ఇరువురు దొంగలను అరెస్టు చే సినట్లు ఒంగోలు రూరూల్‌ సీఐ ఆర్‌.రాంబాబు తెలిపారు. మంగళవారం మద్దిపాడు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు.

ఇరువురు దొంగలు అరెస్టు
నిందితులను చూపుతున్న పోలీసులు

మద్దిపాడు, జూన్‌ 22 : చోరీలకు పాల్పడుతున్న ఇరువురు దొంగలను అరెస్టు చే సినట్లు ఒంగోలు రూరూల్‌ సీఐ ఆర్‌.రాంబాబు తెలిపారు. మంగళవారం మద్దిపాడు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. ఒంగోలు బలరాంకాలనీకి చెందిన దార్ల రాంబాబు, దార్ల వెం కయ్యలు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు ఒంగోలు, మద్దిపాడు పరిసర ప్రాంతాల్లో ఇనప ముక్కలు ఏరుకుంటూ దొంగతనాలు చేయడం వృత్తిగా మలుచుకున్నారు. ఈక్రమంలో మద్దిపాడులో కార్పెంటర్‌ సుబ్బారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి బీరువాలో ఉన్న 6 గ్రాముల బంగారు ఆభరణాలు, బం గారం ఉంగరం దొంగిలించారు. అలాగే వెల్లంపల్లి సెల్‌టవర్‌ వద్ద తాళాలు పగుల కొట్టి రెండు బ్యాటరీలు, గడ్డపార్ల సామగ్రి కిట్‌, ఎల్‌జీపీ రెగ్యులేటర్‌లను చోరీ చేశా రు. వాటిని సమీపంలోని హైవే బ్రిడ్జి కింద చిల్లచెట్లలో దాచి ఉంచారు. ఈనేప థ్యంలో అపహరించిన సొత్తను తీసుకు వెళుతుండగా గ్రామస్థులు అనుమానించి మద్దిపాడు ఎస్‌ఐ నాగరాజుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన తన సిబ్బంది తో వచ్చి నిందితులను అరెస్టు చేశారు. వారిని విచారించగా రెండు ప్రాంతాల్లో దొం గతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని సీఐ తెలిపారు. 


Updated Date - 2021-06-23T06:39:06+05:30 IST