కేరళలో heavy rains...ఐఎండీ రెడ్ అలర్ట్

ABN , First Publish Date - 2021-11-15T18:27:58+05:30 IST

కేరళ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల వల్ల ఇద్దరు పిల్లలు మరణించారు....

కేరళలో heavy rains...ఐఎండీ రెడ్ అలర్ట్

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల వల్ల ఇద్దరు పిల్లలు మరణించారు. భారీవర్షాల వల్ల కేరళలోని పలు రాష్ట్రాల్లో వరదలు వెల్లువెత్తుతుండటంతో జనజీవనం స్తంభించి పోయింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.తన ఇంటికి సమీపంలో సంభవించిన వరదల్లో మునిగి మూడేళ్ల బాలుడు మరణించాడు.తల్లితో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్నారి కాలు జారి వాగులో పడి మరణించింది. మరో ఘటనలో కన్నూర్ జిల్లాకు చెందిన ఓ చిన్నారి వర్షపు నీటితో పొంగిపొర్లుతున్న బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది.కేరళలోని అప్పర్ కుట్టనాడ్‌లోని పలు ప్రాంతాలు భారీగా జలమయమయ్యాయి.


కేరళలో వారాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం విజయన్ ప్రజలను కోరారు.కొండచరియలు విరిగిపడే అవకాశం ,వరదలు సంభవించే అవకాశం ఉన్న పలు జిల్లాలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.భారీ వర్షాల కారణంగా దక్షిణ కేరళలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.కేరళ రాష్ట్రంలోని వివిధ డ్యామ్‌లలో నీటిమట్టం కూడా రెడ్ అలర్ట్ మార్క్‌కు పెరగడంతో ఇడుక్కి రిజర్వాయర్‌కు చెందిన చెరుతోని డ్యామ్‌లోని ఒక షట్టర్‌ను ప్రభుత్వం ఆదివారం తెరిచింది.




Updated Date - 2021-11-15T18:27:58+05:30 IST