Red Seaలో ఈదుతున్న ఇద్దరు మహిళలను చంపిన షార్క్

ABN , First Publish Date - 2022-07-04T13:34:26+05:30 IST

ఈజిప్ట్ దేశంలోని ఎర్ర సముద్రంలో ఈత కొడుతుండగా షార్క్ చేప దాడిలో ఇద్దరు మహిళలు మరణించారు....

Red Seaలో ఈదుతున్న ఇద్దరు మహిళలను చంపిన షార్క్

కైరో (ఈజిప్ట్): ఈజిప్ట్ దేశంలోని ఎర్ర సముద్రంలో ఈత కొడుతుండగా షార్క్ చేప దాడిలో ఇద్దరు మహిళలు మరణించారు.ప్రపంచంలోనే ఎర్ర సముద్రం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ సముద్రంలో సొరచేపలు(షార్క్) సాధారణంగా ఉంటాయి. కానీ ఈత కొడుతున్న వ్యక్తులపై ఈ షార్క్ చేపలు అరుదుగా దాడి చేస్తాయి.షార్క్ దాడిలో మరణించిన మహిళల్లో ఒకరు ఆస్ట్రియన్, మరొకరు రొమేనియన్ ఉన్నారని ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ, పర్యాటక,విదేశాంగ మంత్రిత్వ శాఖలు తెలిపాయి.ఎర్ర సముద్రంలోని హుర్ఘాదాకు దక్షిణాన ఉన్న సహల్ హషీష్ ప్రాంతంలో ఈత కొడుతుండగా ఇద్దరు మహిళలపై షార్క్ దాడి చేసిందని ఈజిప్టు మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌లో తెలిపింది. 


ఈ ఘటనతో ఎర్ర సముద్రం గవర్నర్ అమ్ర్ హనాఫీ ఆ ప్రాంతంలోని అన్ని బీచ్‌లను మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.షార్క్ దాడి ఘటన వెనుక కారణాలను గుర్తించడానికి ఒక టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందని పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది.2018వ సంవత్సరంలో రెడ్ సీ బీచ్‌లో ఒక టూరిస్టును షార్క్ చంపింది. 2015లో ఇదే తరహా షార్క్ దాడిలో ఓ జర్మన్ టూరిస్ట్ మరణించాడు.ఈజిప్టు దేశం 2011 తిరుగుబాటు, అశాంతి, కరోనావైరస్ మహమ్మారితో సహా గత దశాబ్దంలో పర్యాటక రంగం దెబ్బతింది.

Updated Date - 2022-07-04T13:34:26+05:30 IST