Florida Lockdown: ఆ చిన్న ప్రాణికి.. అమెరికానే వణికింది.. రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్..

Published: Sat, 16 Jul 2022 15:45:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Florida Lockdown: ఆ చిన్న ప్రాణికి.. అమెరికానే వణికింది.. రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్..

అమెరికా(America)లోని ఫ్లోరిడా నగరం ఇప్పుడు నత్తలను చూసి గజగజ వణుకుతోంది. నత్తల(snails) కారణంగా అక్కడ అధికారులు కొత్త తరహా లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు. సాధారణంగా నత్తలు నీటిలో జీవిస్తాయి. కానీ జెయింట్‌ ఆఫ్రికన్ ల్యాండ్‌ స్నెయిల్‌(African land snail) జాతికి చెందిన నత్తలు నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, ఆకులు తింటూ జీవిస్తాయి. తొమ్మిదేళ్ల పాటు జీవించే ఈ నత్తలు ఎనిమిది అంగుళాల పొడవుంటాయి.

Florida Lockdown: ఆ చిన్న ప్రాణికి.. అమెరికానే వణికింది.. రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్..

ఫ్లోరిడాలో ఈ రాకాసి నత్తల సంతతి ఒక్కసారిగా పెరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నత్తలు.. దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట పంటలు తీవ్రంగా పాడవుతున్నాయి. ఇక వీటిపై ఉండే సూక్ష్మజీవుల కారణంగా మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి(disease) వస్తున్నట్టు గుర్తించారు.  ఈ నత్తలు కాంక్రీట్‌ను కూడా తింటాయని.. దీంతో భవనాలు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది.

Viral Video: నడి రోడ్డులో ఇద్దరు యువతుల కొట్లాట.. అసలు కారణం తెలుసుకుని అవాక్కవుతున్న నెటిజన్లు..

ఇప్పుడు అమెరికాకు ఆఫ్రికన్ జెయింట్ నత్తలు పెద్ద సమస్యగా మారాయి. పోర్ట్‌ రిచీ పట్టణంలో జెయింట్ నత్తలను అధికారులు గుర్తించారు. ఈ నత్తల గుడ్లు మట్టి, మొక్కలు, కలప తరలింపు ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉండడంతో ఆ ప్రాంతంలో రెండేళ్ల పాటు కొత్త తరహా లాక్‌డౌన్(Lockdown) పెట్టారు. ఆ ప్రాంతం నుంచి ఎలాంటి మొక్కలు, మట్టి, చెత్త,  భవన నిర్మాణ సామగ్రి, పంటలకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులు, సామగ్రిని బయటికి తీసుకెళ్లకుండా నిషేధం విధించారు.

అశ్లీల వీడియోలు చూస్తుండగా.. మధ్యలో Popup notification.. ఓపెన్ చేసిన కాసేపటికి యువతి నుంచి ఫోన్.. చివరకు..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఒకే ఒక్క విషయంలో మాట వినలేదని.. ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచి.. ఇద్దరు స్నేహితులతో కలిసి..పది రోజులకో పెళ్లి.. ఒక్క నెలలోనే ముగ్గురితో వివాహం.. ఈ యువతి నిర్వాకం తెలిసి నివ్వెరపోతున్న భర్తలు..!వయసు మీద పడుతున్నా ఆ ఊళ్లోని అబ్బాయిలకు పెళ్లే కావడం లేదట.. అసలు సంబంధాలే రాకపోవడం వెనుక..!Viral Video: ఇది పబ్లిక్ ప్లేస్! బాగుండదంటూ.. యువకుడు వారిస్తున్నా వినకుండా.. యువతి ఏం చేసిందంటే..videoViral photo: ఎద్దులపై భారం పడకుండా.. విద్యార్థుల వినూత్న ఐడియా.. అద్భుత ఆవిష్కరణ అంటూ నెటిజన్ల ప్రశంసలు..videoఒకప్పుడు పొలాల్లో పశువుల కాపరి.. ప్రస్తుతం ఈ మహిళ ఏ రేంజ్‌లో ఉందో అస్సలు ఊహించలేరు.. ఒక్కో ఏడాదికి..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.