Kuwait: విదేశీ టీచర్లకు రెండేళ్ల రెసిడెన్సీ పర్మిట్.. కానీ, కండిషన్ అప్లై అంటున్న హెల్త్ మినిస్ట్రీ

ABN , First Publish Date - 2022-06-29T18:28:12+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లోని స్కూళ్లలో పని చేస్తున్న విదేశీ ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఒక ఏడాది కాలానికి మాత్రమే రెసిడెన్సీకి అనుమతి ఉంది.

Kuwait: విదేశీ టీచర్లకు రెండేళ్ల రెసిడెన్సీ పర్మిట్.. కానీ, కండిషన్ అప్లై అంటున్న హెల్త్ మినిస్ట్రీ

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లోని స్కూళ్లలో పని చేస్తున్న విదేశీ ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఒక ఏడాది కాలానికి మాత్రమే రెసిడెన్సీకి అనుమతి ఉంది. ఇది ముగిసిన తర్వాత మళ్లీ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, తాజాగా ఆ దేశ విద్యాశాఖ అక్కడి సర్కార్ ముందు కొత్త ప్రతిపాదన ఉంచింది. విదేశీ టీచర్లకు ఒకేసారి రెండేళ్ల రెసిడెన్సీ పర్మిట్ ఇవ్వాలని కోరింది. దీనిపై ప్రభుత్వం సానూకులంగా స్పందించినట్లు సమాచారం. అంతర్గత మంత్రిత్వశాఖ కూడా రెండేళ్ల రెసిడెన్సీకి సుముఖంగా ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అండర్‌సెక్రటరీ రాజా బౌర్కి వెల్లడించారు. కానీ, టీచర్లు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఆరోగ్యశాఖ సమన్వయంతో ఉపాధ్యాయులు జీవిత బీమా తీసుకోవాలని అంతర్గత మంత్రిత్వశాఖ సూచించిందని పేర్కొన్నారు. ఒకవేళ ఈ నిర్ణయం ఆమోదం పొందితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తుందని బౌర్కి చెప్పారు. అలాగే విదేశీ ఉపాధ్యాయులకు యేటా ఇస్తున్న రెసిడెన్సీ పర్మిట్ల సంఖ్యను కూడా పెంచేందుకు అంతర్గత శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు.  

Updated Date - 2022-06-29T18:28:12+05:30 IST