అమెరికాలో చదువుకోవాలనే వారికి ఆర్థిక చేయూత

ABN , First Publish Date - 2022-08-08T06:02:49+05:30 IST

అమెరికాలో ఉన్నత విద్య చదవు కోవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు ఆర్థిక చేయూత అందిస్తామని అన్నా క్యాంటీన్ల వ్యవస్ధాపకుడు, ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ అన్నారు.

అమెరికాలో చదువుకోవాలనే వారికి ఆర్థిక చేయూత
విద్యార్థినులతో మాట్లాడుతున్న ఉయ్యూరు శ్రీనివాస్‌

అన్నా క్యాంటీన్ల వ్యవస్ధాపకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్‌

గుంటూరు(తూర్పు), ఆగస్టు 7: అమెరికాలో ఉన్నత విద్య చదవు కోవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు ఆర్థిక చేయూత అందిస్తామని అన్నా క్యాంటీన్ల వ్యవస్ధాపకుడు, ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ అన్నారు. స్ధానిక కుందుల రోడ్డులోని కమ్మ జన సేవాసమితి బాలికల వసతి గృహంలో ఆదివారం విద్యార్థినులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలోని వర్జీనీయా రాష్ట్రంలో ప్రవాస భారతీయులు గ్రూపుగా ఏర్పడి ఏడాదికి 20 మంది విద్యార్థులుకు ఐదేళ్ల పాటు ఆర్థిక సహకారం అందించేందుకు తగిన కార్యచరణ రూపొందించామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా 1.5 మిలియన్‌ డాలర్ల మూలధనంను ఏర్పాటు చేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విధ్యార్థులతో పాటు, వసతిగృహం నుంచి వచ్చే విధ్యార్థినులకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అలాగే ఇమిగ్రేషన్‌లో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి, వీసా రిజక్ట్‌ గాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు తగిన సూచనలను అందిస్తామన్నారు. గుంటూరులో రెండు, హిందుపురంలో ఇకటి చొప్పున అన్నా క్యాంటీన్లును ఏర్పాటు చేశామన్నారు. కుల, మతాలకు అతీతంగా భోజనం అందిస్తున్నామని ఇందుకోసం రూ.2 కోట్లు మేర నిధులను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. సామినేని కోటేశ్వర రావు మాట్లాడుతూ పేద, ప్రతిభ కలిగిన విద్యార్థులకు అనేక మంది దాతలు అండగా ఉన్నారన్నారు. విద్యార్థులు వారి సహాకారానిన సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఉన్నత స్ధాయికి ఎదిగిన శ్రీనివాస్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వసతిగృహ పాలక వర్గ సభ్యులు చుక్కపల్లి రమేష్‌, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి, పావులూరి వీరయ్య, ఉయ్యూరు గీత, ఉయ్యూరు సోనిక తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T06:02:49+05:30 IST