U-turn: కేజ్రీవాల్‌ను డిన్నర్‌కి పిలిచిన ఆటోరిక్షా డ్రైవరు..మోదీ అభిమాని

ABN , First Publish Date - 2022-10-01T14:59:25+05:30 IST

రాజకీయ నాయకులే కాదు తనలాంటి సాధారణ ఓటరు కూడా పార్టీ ఫిరాయిస్తారని నిరూపించారు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad) నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన ఆటోరిక్షా డ్రైవరు విక్రమ్ దంతాని...

U-turn: కేజ్రీవాల్‌ను డిన్నర్‌కి పిలిచిన ఆటోరిక్షా డ్రైవరు..మోదీ అభిమాని

ప్రధాని సభలో కాషాయ టోపి, కండువాతో ప్రత్యక్షం

అహ్మదాబాద్(గుజరాత్): రాజకీయ నాయకులే కాదు తనలాంటి సాధారణ ఓటరు కూడా పార్టీ ఫిరాయిస్తారని నిరూపించారు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad) నగరంలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన ఆటోరిక్షా డ్రైవరు విక్రమ్ దంతాని(autorickshaw driver Vikram Dantani) ఇటీవల ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను(Delhi CM Arvind Kejriwal) తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి సంచలనం రేపారు. సెప్టెంబర్ 13వతేదీన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో(Gujarat ) ఈ ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ ప్రచారంలో(AAP's campaign) భాగంగా ఆటోరిక్షా డ్రైవర్లతో టౌన్ హాలులో సమావేశం నిర్వహించారు.


 ఇంటరాక్షన్ సమయంలో ఆటోరిక్షా డ్రైవరు అయిన విక్రమ్ దంతాని... కేజ్రీవాల్ ను తన ఇంట్లో విందు చేయాలని కోరారు. సమావేశంలో ఆటోడ్రైవరు విందు ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అతని ఆటోరిక్షాలో ఇంటికి వెళ్లారు. ఆటోడ్రైవరు ఇంట్లో కింద కూర్చొని భోజనం చేసిన కేజ్రీవాల్ అనంతరం విక్రమ్ దంతానీని ఢిల్లీకి ఆహ్వానించి వెళ్లారు. అయితే కేవలం ఈ ఘటన జరిగిన 17 రోజులకే ఆటోరిక్షా డ్రైవరు యూటర్న్(U turn) తీసుకున్నారు. అహ్మదాబాద్‌లో శుక్రవారం జరిగిన ప్రధాని మోదీ ర్యాలీలో కనిపించారు.


బీజేపీ టోపీ, కాషాయ కండువా ధరించి, బీజేపీ(BJP) కార్యకర్తలతో కలిసి మోదీ ర్యాలీలో పాల్గొని కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి(Modiji) వీరాభిమానినని, ఆయన పార్టీ బీజేపీకి గట్టి మద్దతుదారునని విక్రమ్ దంతానీ చెప్పారు. ‘‘నేను మోదీజీకి వీరాభిమానిని కాబట్టి నేను  ఆయన ర్యాలీలో పాల్గొనడం కోసం వచ్చాను. నేను మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నాను, గతంలో ఎప్పుడూ బీజేపీకే ఓటు వేశాను. నేను ఏ ఒత్తిడితోనూ ఇలా చెప్పడం లేదు’’ అని దంతాని పేర్కొన్నారు. 


Updated Date - 2022-10-01T14:59:25+05:30 IST