దుబాయ్‌ వీసా విధానంలో సంస్కరణలు.. వృత్తి నిపుణులకు 5 ఏళ్ల గ్రీన్‌ వీసాలు !

ABN , First Publish Date - 2022-04-20T13:11:06+05:30 IST

వీసా విధానంలో దుబాయ్‌ పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఉపాధి, సందర్శక, కుటుంబ వీసాలు పది రకాల వీసాల జారీలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టింది. అర్హులైన వృత్తి నిపుణులకు యాజమానుల నుంచి చిక్కులేవీ లేకుండా నేరుగా అయిదేళ్ల గ్రీన్‌ వీసా విధానాన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది.

దుబాయ్‌ వీసా విధానంలో సంస్కరణలు.. వృత్తి నిపుణులకు 5 ఏళ్ల గ్రీన్‌ వీసాలు !

(గల్ఫ్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి): వీసా విధానంలో దుబాయ్‌ పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఉపాధి, సందర్శక, కుటుంబ వీసాలు పది రకాల వీసాల జారీలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టింది. అర్హులైన వృత్తి నిపుణులకు యాజమానుల నుంచి చిక్కులేవీ లేకుండా నేరుగా అయిదేళ్ల గ్రీన్‌ వీసా విధానాన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. మానవవనరుల అభివృద్ధి, ఇమరాతీల మంత్రిత్వ శాఖ వర్గీకరించిన విధంగా మూడు కేటగిరీల్లోని వారికి ఈ గ్రీన్‌ వీసా విధానం వర్తిస్తుందని వెల్లడించింది. శాస్త్రవేత్తలు, ప్రత్యేక వైద్య నిపుణులు, ఎంపిక చేసిన క్రీడాకారులు తదితరులు మాత్రమే ఈ కేటగిరీ కిందకు వస్తారు. సంబంధిత అంశంలో డిగ్రీ కనీసార్హత కాగా.. మరియు 15 వేల దిర్హాంల వేతనం పొందుతున్నవారు ఈ వీసాకు అర్హులు. గ్రీన్‌ వీసా ఫ్రీలాన్సర్‌ అనే మరో శ్రేణి కింద యాజమాని లేదా స్పాన్సర్‌ అవసరం లేకుండానే 5 ఏళ్ల పాటు వీసా పొందే వీలుంది. 


దరఖాస్తుదారులు రెండేళ్లుగా 3.6 లక్షల దిర్హాంలు(సుమారు రూ.75 లక్షలు) కనీసవార్షిక వేతనం పొందుతుండాలని నిబంధన విధించారు. వీసా పొందేందుకు ప్రస్తుత వయోపరిమితి 18 ఏళ్లు కాగా.. తాజాగా దానిని 25 ఏళ్లకు పెంచారు. పెళ్లి కాని కూతుళ్లను ప్రవాసులు తమ వీసా గడువుకు అనుగుణంగా తమతో పాటే ఉంచుకోవచ్చు. సందర్శక వీసా వ్యవధి ప్రస్తుతం 30 రోజులు ఉండగా.. దానిని ఇప్పుడు రెట్టింపు చేశారు. ఇది వీసా ఆన్‌ అరైవల్‌ వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ జాబితాలో భారత్‌లో లేదు. తెలుగు రాష్ట్రాలు సహా భారత్‌ నుంచి వేలాదిమంది 90 రోజుల వ్యవధి కల్గిన ముందస్తు వీసాతో వస్తుంటారు.స్థానిక విద్యాసంస్ధలలో ప్రవేశం పొందే విద్యార్థులకూ రెండేళ్ళ వీసా, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవారికీ ప్రత్యేక కేటగిరీ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


Updated Date - 2022-04-20T13:11:06+05:30 IST