Eid Al Adha: యూఏఈలో ఎన్ని రోజులు సెలవులంటే..

ABN , First Publish Date - 2022-07-01T16:36:36+05:30 IST

ఈద్ అల్ అదా (Eid Al Adha) కు సంబంధించి సెలవులపై ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ గురువారం కీలక ప్రకటన చేసింది.

Eid Al Adha: యూఏఈలో ఎన్ని రోజులు సెలవులంటే..

అబుదాబి: ఈద్ అల్ అదా (Eid Al Adha) కు సంబంధించి సెలవులపై ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ గురువారం కీలక ప్రకటన చేసింది. పబ్లిక్, ప్రైవేట్ రెండు రంగాలకు కూడా బక్రీద్ సందర్భంగా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ(శుక్రవారం) నుంచి 11వ తేదీ(సోమవారం) వరకు హాలీడేస్‌గా పేర్కొంది. ఈ నాలుగు రోజుల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వశాఖలతో పాటు ప్రైవేట్ సంస్థలన్నీ కూడా క్లోజ్ ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. తిరిగి 12వ తేదీ(మంగవారం) నుంచి యధావిధిగా ఉద్యోగులు విధులకు హాజరు అవుతారని తెలిపారు.  


అటు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ (Emiratisation) మంత్రిత్వ శాఖ ప్రైవేట్ రంగానికి ఈద్ అల్ అదాకు చెల్లింపులతో కూడిన సెలవు 9న ధు అల్-హిజ్జా (అరాఫత్ దినం)ను పురస్కరించుకుని జూలై 8న(శుక్రవారం) ప్రారంభమవుతుందని తెలిపింది. అలాగే జూలై 11వ తేదీ సోమవారంతో ముగుస్తుందని ప్రకటించింది. ఇక 2021, 2022 సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఆమోదించబడిన అధికారిక సెలవుల విషయమై క్యాబినెట్ నిర్ణయం అమలులోకి ఇది కూడా వస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా మంత్రిత్వశాఖకు చెందిన  అధికారులు దేశ అధ్యక్షుడు, హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, ఎమిరేట్స్ సుప్రీం కౌన్సిల్ సభ్యులు, పాలకులకు, UAE, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 


Updated Date - 2022-07-01T16:36:36+05:30 IST