UAE: యూఏఈ కొత్త మల్టీపుల్ ఎంట్రీ వీసాలు.. ఎవరికో తెలుసా..?

ABN , First Publish Date - 2022-09-01T13:57:02+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కొత్త మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఇవి సాధారణంగా ఇచ్చే వీసాలు మాత్రం కావు. కేవలం ఖతార్‌ (Qatar)లో జరిగిగే ఫిఫా వరల్డ్ కప్-2022 (FIFA World Cup-2022) కోసం వచ్చే వారికి ప్రత్యేకంగా వీటిని జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.

UAE: యూఏఈ కొత్త మల్టీపుల్ ఎంట్రీ వీసాలు.. ఎవరికో తెలుసా..?

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కొత్త మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఇవి సాధారణంగా ఇచ్చే వీసాలు మాత్రం కావు. కేవలం ఖతార్‌ (Qatar)లో జరిగిగే ఫిఫా వరల్డ్ కప్-2022 (FIFA World Cup-2022) కోసం వచ్చే వారికి ప్రత్యేకంగా వీటిని జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికోసం 100 దిర్హమ్స్(రూ.2,164) చెల్లించాల్సి ఉంటుంది. హయ్యా కార్డుదారులు (Hayya Card Holders) ఎవరైతే ఫిఫా వరల్డ్ కప్ వస్తారో వారు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ వీసా ఉంటే 90 రోజుల పాటు యూఏఈలో మల్టీపుల్ ఎంట్రీకి వీలు కలుగుతుంది. 


కాగా, ఫిఫా (FIFA) ప్రపంచ కప్ 2022కి ఆతిథ్యం ఇస్తున్న ఖతార్‌కు (Qatar) మద్దతు ఇవ్వడంలో భాగంగానే ఈ ప్రత్యేక మల్టీపుల్ ఎంట్రీ వీసా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఈ సందర్భంగా యూఏఈ (UAE) స్పష్టం చేసింది. ఇక 2022 నవంబర్ 1 నుంచి 2023 జనవరి 23 మధ్య ఖతార్‌ను సందర్శించే వారికి హయ్యా కార్డు(Hayya Card) తప్పనిసరి. ఈ కార్డుదారులకు మాత్రమే యూఏఈ మల్టీపుల్ ఎంట్రీ వీసా అందించనుంది. ఈ వీసాను సాధారణ రుసుము చెల్లించి మరో 90 రోజుల పాటు పొడిగించుకునే వెసులుబాటును కూడా యూఏఈ కల్పిస్తోంది. 


దరఖాస్తు చేసుకోండిలా..

ఈ మల్టీపుల్ ఎంట్రీ వీసాను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ(ICP) వెబ్‌సైట్‌ (https://icp.gov.ae/new-generation-of-emirati-passport/)కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌కు వెళ్లిన తర్వాత స్మార్ట్ ఛానెల్స్ సెక్షన్‌లోని పబ్లిక్ సర్వీస్‌‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అందులోని హయ్యా కార్డు హోల్డర్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం పేమెంట్, ట్రావెలర్ వివరాలు ఫిల్ చేయడం ద్వారా వీసా ప్రాసెస్ పూర్తవుతుంది. వీసా జారీ అయిన రోజు నుంచి 90 రోజుల స్టే పరిమితి ప్రారంభం అవుతుంది.  

Updated Date - 2022-09-01T13:57:02+05:30 IST