UAE-Visa: యూఏఈలో సోమవారం నుంచీ కొత్త వీసా విధానం.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ABN , First Publish Date - 2022-10-03T02:46:12+05:30 IST

యూఏఈలో సోమవారం(అక్టోబర్ 3) నుంచీ కొత్త వీసా విధానం అమల్లోకి రానుంది.

UAE-Visa: యూఏఈలో సోమవారం నుంచీ కొత్త వీసా విధానం.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

ఎన్నారై డెస్క్: యూఏఈలో సోమవారం(అక్టోబర్ 3) నుంచీ కొత్త వీసా విధానం అమల్లోకి రానుంది. ఈ విప్లవాత్మక విసా విధానం గురించి ప్రభుత్వం గత నెలలోనే ప్రకటించింది. మునుపటి వీసా పాలసీలో కీలక మార్పుల చేసి.. ఈ కొత్త విధానాన్ని సిద్ధం చేసినట్టు పేర్కొంది. తాజా మార్పులు భారతీయులకు ఎంతో ఉపయోగపడనున్నాయనేది పరిశీలకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో.. భారతీయులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం. 


  • ఐదేళ్ల కాలపరిమితి గల గ్రీన్ వీసాదారులు.. యూఏఈ సంస్థల స్పాన్సర్‌షిప్ లేదా యూఏఈ పౌరుల సాయం లేకుండానే ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. ఫ్రీలాన్సర్లు, నిపుణులైన వర్కర్లు, ఇన్వెస్టర్లు ఈ వీసా పొందేందుకు అర్హులు. 
  • గ్రీన్ వీసాదారులు తమ కుటుంబసభ్యులకు కూడా వీసా స్పాన్సర్ చేయచ్చు.
  • గ్రీన్ వీసా కాలపరిమితి ముగిశాక.. రెన్యూవల్ చేయించుకునేందుకు ప్రభుత్వం ఆరు నెలల వరకూ గడువిచ్చింది. 
  • గోల్డెన్ వీసా ఉన్న వారు పదేళ్ల పాటు యూఏఈలో నివసించేందుకు అనుమతి ఉంది. ఇన్వెస్టర్లు, ఆంత్రప్రెన్యూర్లు, తమ తమ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు కలవారందరూ ఈ వీసాకు అర్హులు
  • గోల్డెన్ వీసా పొందిన వారు తమ సంతానం, కుటుంబసభ్యులకు వీసా స్పాన్సర్ చేయచ్చు.
  • గోల్డెన్ వీసాదారులు మరణించిన సందర్భంలో వారి కుటుంబసభ్యులు.. వీసా కాలపరిమితి ముగిసే వారకూ యూఏఈలో ఉండొచ్చు
  • గోల్డెన్ వీసా పొందిన వారు తమ వ్యాపారాల్లో 100 శాతం వరకూ వాటా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
  • టూరిస్ట్ వీసా గల వారు ఇకపై యూఏఈలో 60 రోజుల వరకూ ఉండొచ్చు
  • ఇక ఐదేళ్ల కాలపరిమితిపై జారీ చేసే మల్టీ ఎంట్రీ వీసా పొందిన వారు.. యూఏఈలో వరుసగా 90 రోజులపాటు ఉండేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 
  • జాబ్ ఎక్స్‌ప్లొరేషన్ వీసాదారులు..తమకు స్పాన్సర్ లేదా ఆథిత్యమిచ్చేవారు లేకపోయినా కూడా యూఏఈలో ఉపాధి కోసం ప్రయత్నించవచ్చు. 

Updated Date - 2022-10-03T02:46:12+05:30 IST