13 ముస్లిం దేశాలపై వీసా ఆంక్షలు విధించిన యూఏఈ

ABN , First Publish Date - 2020-11-26T05:40:43+05:30 IST

యూఏఈ ప్రభుత్వం 13 ముస్లిం దేశాలపై తాత్కాలికంగా వీసా ఆంక్షలను విధించింది. భద్రతా కారణాల దృష్ట్యానే ముస్లిం

13 ముస్లిం దేశాలపై వీసా ఆంక్షలు విధించిన యూఏఈ

దుబాయి: యూఏఈ ప్రభుత్వం 13 ముస్లిం దేశాలపై తాత్కాలికంగా వీసా ఆంక్షలను విధించింది. భద్రతా కారణాల దృష్ట్యానే ముస్లిం దేశాలపై యూఏఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఈ ఆంక్షలతో ఆయా దేశాలకు చెందిన వారు యూఏఈ ఎంప్లాయిమెంట్, విజిట్ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఉండదు. అయితే ఈ ఆంక్షల్లో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం యూఏఈ వీసా కలిగి ఉన్న వారిపై మాత్రం ఎటువంటి ఆంక్షలు ఉండబోవని తెలుస్తోంది. యూఏఈకి చెందిన ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్‌షిప్ వీసా నిషేధంపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌తో యూఏఈ ప్రభుత్వం రెండు నెలల క్రితం అధికారిక సంబంధాలను ఏర్పరచుకుంది. 


ఈ చర్య దశాబ్దాల అరబ్ పాలసీని బ్రేక్ చేయడమే కాకుండా ముస్లిం దేశాలకు ఆగ్రహాన్ని కూడా తెప్పించింది. ఈ కారణంగానే తాజాగా యూఏఈ ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించిందని కూడా వార్తలు వస్తున్నాయి. మరికొందరు అటువంటిది ఏమీ లేదని త్వరలోనే ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక నిషేధం విధించిన దేశాల జాబితాలో ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, అల్జీరియా, కెన్యా, ఇరాక్, లెబనాన్, టునీషియా, టర్కీ తదితర దేశాలున్నాయి. ఇటీవల సౌదీ అరేబియాలో దౌత్యవేత్తలపై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తరువాత అప్రమత్తంగా ఉండాలంటూ యూఏఈలోని ఫ్రెంచ్ ఎంబసీ తమ దేశపౌరులను హెచ్చరించింది. ఫ్రెంచ్ ఎంబసీ ప్రకటన చేసిన వారం తరువాతే ఈ వీసాలపై నిషేధం విధించడం విశేషం.

Updated Date - 2020-11-26T05:40:43+05:30 IST