యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మదర్ అండ్ చైల్డ్ టాలెంట్ షో’

ABN , First Publish Date - 2022-06-19T22:22:51+05:30 IST

షార్జాలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 18న మదర్ అండ్ చైల్డ్ టాలెంట్ షో వైభవంగా జరిగింది. మంతెన అమెరికన్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.

యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మదర్ అండ్ చైల్డ్ టాలెంట్ షో’

షార్జాలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 18న మదర్ అండ్ చైల్డ్ టాలెంట్ షో వైభవంగా జరిగింది. మంతెన అమెరికన్  పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా.. చిత్రలేఖనము, సంగీతం, నృత్య ప్రదర్శనలు, పలు ప్రతిభా ప్రదర్శనలు, స్నేహపూర్వక పోటీలు, బింగో తదితర ఈవెంట్లు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం తెలుగువారందరినీ ఎంతో అలరించింది. పర్వీన్, మహిళా బృందం ఇతర సభ్యులు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన వీణా ఉత్తంచందానీ(VSSS dubai అధ్యక్షురాలు) న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాకుండా.. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు తగు సలహాలు కూడా ఇచ్చారు.


దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం నిర్వహణలో అసోసియేషన్ మహిళా విభాగం సభ్యులు ఫ్లోరెన్స్ విమల, ఉషా దేవి ముఖ్యపాత్ర పోషించారు. అసోసియేషన్ కార్యనిర్వహక సభ్యులు లలిత, జయ తదితరులు తమ తోడ్పాటునందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అసోసియేషన్ సభ్యులకు  సభికులు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరగాలని ఆకాక్షించారు. కాగా.. తెలుగువారి యాజమాన్యంలో ఇటీవలే ప్రారంభమైన ‘‘మంతెన అమెరికన్ విద్యాలయము’’ ఈ కార్యక్రమానికి వేదిక అయింది. దుబాయిలోని మాగ్నం క్లీనిక్, జే ఫ్యాషన్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. 



Updated Date - 2022-06-19T22:22:51+05:30 IST