Uber ఛార్జీల మోత.. మరీ ఇంత దారుణమా.. దీనికంటే విమాన ప్రయాణమే బెటర్!

ABN , First Publish Date - 2022-07-07T20:36:13+05:30 IST

ఓ వ్యక్తికి Uber షాకిచ్చింది. కేవలం 50 కిలోమీటర్ల దూరానికి Uber విధించే ఛార్జీలను చూసి అతడి మైండ్ బ్లాంక్ అయింది. దీంతో వెంటనే అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో

Uber ఛార్జీల మోత.. మరీ ఇంత దారుణమా.. దీనికంటే విమాన ప్రయాణమే బెటర్!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తికి Uber షాకిచ్చింది. కేవలం 50 కిలోమీటర్ల దూరానికి Uber విధించే ఛార్జీలను చూసి అతడి మైండ్ బ్లాంక్ అయింది. దీంతో వెంటనే అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇటీవల కాలంలో సాధారణంగా ఎవరూ బస్‌లు, ఆటోల కోసం వేచి చూడటం లేదు. సింపుల్‌గా తమ మొబైల్ ఫోన్ ద్వారానే క్యాబ్‌లను బుక్ చేసుకుని సమయానికి తమ గమ్యస్థానాలకు రీచ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన శ్రవణ్ కుమార్ సువర్ణ అనే వ్యక్తి.. తాజాగా Uber‌ను ఆశ్రయించాడు. భారీ వర్షాల కారణంగా బస్సుల కోసం వెయిట్ చేయకుండా తొందరగా ఇంటికి వెళ్లేందుకు తన మొబైల్‌లో ఉబెర్ యాప్‌ను ఓపెన్ చేశాడు. అనంతరరం తాను ఉన్న ప్రదేశం వివరాలతోపాటు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇంటి అడ్రెస్‌ను యాప్‌లో ఎంటర్ చేశాడు. 



కొద్ది సమయం తర్వాత Uber చూపించిన ఛార్జీలను చూసి బిత్తర పోయాడు. ప్రభాదేవీ నుంచి డోంబివిలి‌కి ట్యాక్సీ ఛార్జీ తక్కువలో తక్కువ అక్షరాల రూ.3.041.54 చూపించడంతో షాకయ్యాడు. కొద్ది సమయం తర్వాత ఆ షాక్ నుంచి తేరుకున్న అతడు.. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘క్యాబ్‌లో మా ఇంటికి వెళ్లడం కంటే.. విమానంలో గోవాకు వెళ్లడమే తక్కువ ఖర్చుతో కూడిన పని’ అంటూ తన అసంతృప్తిని వ్యక్త పరిచాడు. దీంతో అతడు చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఊబెర్ ఎక్స్ఎల్ రేటుతో నాసిక్ ఔట్స్‌కట్‌లో మంచి 1బీహెచ్‌కే వస్తుంది’ అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2022-07-07T20:36:13+05:30 IST