Uber exits Zomato : జొమాటో నుంచి ఉబర్ నిష్క్రమణ !.. సుమారు రూ.3 వేలకు 7.8 శాతం వాటా విక్రయం

ABN , First Publish Date - 2022-08-04T00:02:05+05:30 IST

రైడ్ షేరింగ్ దిగ్గజం ఉబర్ (Uber) - ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) ఉమ్మడి ప్రయాణం ముగిసింది.

Uber exits Zomato : జొమాటో నుంచి ఉబర్ నిష్క్రమణ !.. సుమారు రూ.3 వేలకు 7.8 శాతం వాటా విక్రయం

న్యూఢిల్లీ : రైడ్ షేరింగ్ దిగ్గజం ఉబర్ (Uber) - ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) ఉమ్మడి ప్రయాణం ముగిసింది. జొమాటోలో తనకున్న 7.8 శాతం వాటాను సుమారు రూ.3 వేల కోట్లకుపైగా(390 మిలియన్ డాలర్లు) భారీ మొత్తానికి ఉబర్ విక్రయించింది. ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజీలపై తన జొమాటో హోల్డింగ్ వాటాను పూర్తిగా అమ్మిందని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి. దీంతో ఇటివల జొమాటో నుంచి వైదొలగిన సంస్థాగత ఇన్వెస్టర్లలో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా ఉబర్ నిలిచింది. కాగా అమెరికాకు చెందిన ఉబర్‌ జులైతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకంగా 2.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. 


జొమాటోలో పెట్టుబడి కారణంగా ఉబర్ భారీగా నష్టపోయింది. జొమాటో షేర్ల (zomato shares) పతన బాటలో కొనసాగుతుండడంతో 9 నెలల్లో 707 మిలియన్ డాలర్లు కోల్పోయినట్టు ఉబర్ అంచనా వేస్తోంది. కాగా గతంలో ఇండియాలో ఫుడ్ డెలివరీ బిజినెస్‌ని 206 మిలియన్ డాలర్లకు ప్రత్యర్థిగా ఉన్న జొమాటోకు విక్రయించిన విషయం తెలిసిందే. మార్కెట్‌లో స్విగ్గీతో (Swiggy) పోటీ పెరిగిపోవడంతో జొమాటో, ఉబర్ ఒక్కటయ్యాయి. ఒప్పందంలో భాగంగా జొమాటోలో 9.99 శాతం వాటాను ఉబర్ కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది జొమాటో షేర్లు భారీగా పతనమయ్యాయి. అదే బాటలో కొనసాగుతున్నాయి. లాక్-ఇన్ పిరియడ్ ముగిసిపోవడంతో షేర్లు గతవారం జీవిత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 

Updated Date - 2022-08-04T00:02:05+05:30 IST