రాత్రి పార్టీ చేసుకుని ఉబెర్ క్యాబ్‌లో ఇంటికి చేరిన యువకుడు.. తెల్లారేసరికి ఊహించని షాక్..! యాప్‌లో మెసేజ్ చూసి..

ABN , First Publish Date - 2022-01-03T02:32:28+05:30 IST

స్నేహితులతో పార్టీ చేసుకుని అర్థరాత్రి ఉబెర్ క్యాబ్‌లో ఇంటికెళ్లిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. కేవలం 19 కిలోమీటర్ల జర్నీకి ఏకంగా 105 పౌండ్లు( మనకరెన్సీలో దాదాపు రూ.10 వేలు) ఖర్చైందని తెలిసి అతడు దిమ్మెరపోయాడు.

రాత్రి పార్టీ చేసుకుని ఉబెర్ క్యాబ్‌లో ఇంటికి చేరిన యువకుడు.. తెల్లారేసరికి ఊహించని షాక్..! యాప్‌లో మెసేజ్ చూసి..

ఇంటర్నెట్ డెస్క్:  స్నేహితులతో పార్టీ చేసుకుని అర్థరాత్రి ఉబెర్ క్యాబ్‌లో ఇంటికెళ్లిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. కేవలం 19 కిలోమీటర్ల జర్నీకి ఏకంగా 105 పౌండ్లు( మనకరెన్సీలో దాదాపు రూ.10 వేలు) ఖర్చైందని తెలిసి అతడు దిమ్మెరపోయాడు. ఇంటికి చేరుకున్నాక  అతడు బిల్లు ఎంతైందో చూసుకోలేదు. కానీ.. మరుసటి రోజు నిద్ర లేచాక ఫోన్‌లో నోటిఫికేషన్ చూసుకున్న అతడికి దిమ్మతిరిగిపోయింది. డిసెంబర్ 27న ఈ ఘటన జరిగింది. కాగా..  బాధితుడు సామ్ జార్జ్ తన గోడును స్థానిక మీడియా వద్ద వెళ్లబోసుకున్నాడు. మాంచెస్టర్ సిటీ సెంటర్ నుంచి 11 మైళ్ల దూరంలో ఉన్న క్రంప్‌సాల్ ప్రాంతానికి వెళ్లినందుకు ఈ స్థాయిలో బిల్లు వచ్చిందని అతడు వాపోయాడు. మార్గమధ్యంలో తన స్నేహితులను దింపేందుకు రెండు మార్లు ఆగాల్సి వచ్చిందని తెలిపాడు. 


అయితే.. ఉబెర్ మాత్రం ఆ బిల్లును సమర్థించుకునే ప్రయత్నం చేసింది. క్యాబ్ బుక్ చేసుకునే ముందే తాము ఖర్చు ఎంత అవుతుందో ముందే చెబుతామని స్పష్టం చేసింది. కాగా.. మాంచెస్టర్-డుబ్లిన్‌ విమాన టిక్కెట్టు ధర కంటే ఉబెర్ బిల్లు ఎక్కువగా ఉండటంతో ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘‘నేను ఆ రాత్రి మద్యం సేవించిన మాట వాస్తవమే అయినా.. బిల్లు కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో లేను.. తప్పు ఉబెర్‌దే’’ అంటూ అతడు తేల్చి చెప్పాడు. ఆ సమయంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా డైనమిక్ విధానంలో ధరల నిర్ణయం జరిగిందని ఉబెర్ ప్రతినిధి పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-03T02:32:28+05:30 IST