ఆ కోటరీ కారణంగానే నాకు మంత్రి పదవి రాలేదు: ఉదయభాను

Published: Mon, 11 Apr 2022 14:17:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆ కోటరీ కారణంగానే నాకు మంత్రి పదవి రాలేదు: ఉదయభాను

అమరావతి: కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించానని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. సోమవారం ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ.. జగన్ దగ్గర జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కోటరిగా ఏర్పడ్డారని పరోక్షంగా కొడాలి నాని, పేర్నినానిని ఉద్దేశిస్తూ ఉదయభాను ఈ వ్యాఖ్యలు చేశారు.ఆ కోటరీ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదన్నారు.వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేశానని చెప్పారు. తన తర్వాత పార్టీలోకి వచ్చినవారికి మంత్రి పదవి ఇచ్చినా బాధపడలేదన్నారు. ఈ విడతలోనైనా ఇస్తారని భావించానని,  అన్ని విధాలా మంత్రి పదవికి తాను అర్హుడినని స్పష్టం చేశారు. పదవి ఎందుకు ఇవ్వలేదో అధిష్ఠానం ఆలోచన చేయాలని ఉదయభాను వ్యాఖ్యానించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.