వైద్యమో రామచంద్ర..!

ABN , First Publish Date - 2022-01-22T03:47:28+05:30 IST

ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు వైద్యమో రామచంద్రా అంటూ నిరీక్షిస్తున్నారు. శుక్రవారం ఇద్దరు వైద్యులు విధులకు హాజరయ్యారు.

వైద్యమో రామచంద్ర..!
వైద్య కోసం నిరీక్షిస్తున్న రోగులు

చికిత్స కోసం రోగులు నిరీక్షణ

ఉదయగిరి, జనవరి 21 : ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు వైద్యమో రామచంద్రా అంటూ నిరీక్షిస్తున్నారు. శుక్రవారం ఇద్దరు వైద్యులు విధులకు హాజరయ్యారు. ఓ వైద్యుడు కొంత సేపు రోగులకు పరీక్షలు నిర్వహించి గంటలోపే విధులకు డుమ్మా కొట్టి వెళ్లిపోయారు. మరో వైద్యురాలు రోగులందరికీ  వైద్యం అందించలేకపోవడంతో కొందరు వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు గంటల తరబడి నిరీక్షించారు. ప్రభుత్వ వైద్యం అందని పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యశాలలకు పరుగుల తీస్తున్నారు. మధ్యాహ్నం అనంతరం కాల్‌ డ్యూటీ డాక్టర్లు అసలే అందుబాటులో ఉండక పోవడంతో ఇక్కడికి వచ్చే రోగులకు సమాధానం చెప్పలేక సిబ్బంది తలలు పట్టుకొంటున్నారు. దీనికి తోడు ఆసుపత్రిలో తాగునీరు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్యశాలలో ఎక్సరే, స్కానింగ్‌ సౌకర్యం ఉన్నా ఇక్కడి వైద్యులు బయట ప్రైవేటు ల్యాబ్‌ల యజమానులతో లాలూచి పడి చీటీలు రాసి పంపడంతో అక్కడ వేలాది రూపాయలు గుంజుతున్నారని రోగులు వాపోతున్నారు. ఈ విషయమై వైద్యశాల ఇంచార్జి డీడీవోను పోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో 

Updated Date - 2022-01-22T03:47:28+05:30 IST